న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిరోజ్ షా కోట్లాలో DC vs SRH: గణాంకాలు ఏం చెబుతున్నాయి!

DC vs SRH Predicted Playing 11, IPL 2019 Match 16 Live Updates: Delhi look to address lower order woes

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కి సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ జట్లు తలపడునున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్‌తో కనిపిస్తోంది. సన్‌రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో బలంగా కనిపిస్తోన్న ఢిల్లీ

ఈ సీజన్‌లో బలంగా కనిపిస్తోన్న ఢిల్లీ

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే గత సీజన్లలో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, ఈ సీజన్‌లో మాత్రం బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించింది. చివరగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

118 పరుగుల భారీ విజయంతో

118 పరుగుల భారీ విజయంతో

గత ఆదివారం ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో అద్భుత సెంచరీలతో సన్‌రైజర్స్‌కు భారీ విజయాన్ని అందించారు. కాగా, ఈ మ్యాచ్‌లో వార్నర్‌ చేతికి గాయమైంది.

ఢిల్లీలో సన్‌రైజర్స్‌ మంచి రికార్డు

ఢిల్లీలో సన్‌రైజర్స్‌ మంచి రికార్డు

అయితే, గురువారం ఢిల్లీతో జరగబోయే మ్యాచ్‌కి వార్నర్ ఫిట్‌గా ఉన్నాడని జట్టు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే ఫిరోజ్‌షా కోట్లాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మంచి రికార్డు ఉంది. ఈ వేదికలో నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా మూడు సార్లు హైదరాబాద్‌దే విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

జట్ల అంచనా

జట్ల అంచనా

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), విజయ్‌ శంకర్‌, యూసఫ్‌ పఠాన్‌, మనీశ్‌పాండే, దీపక్‌ హుడా, మహమ్మద్‌ నబీ, రషీద్ ఖాన్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్ కౌల్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, హనుమ విహారి, అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానే.

1
45772
Story first published: Thursday, April 4, 2019, 18:24 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X