Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: హమ్మయ్య.. ఎట్టకేలకు కావ్య పాప నవ్విందోచ్!!

DC vs SRH: Kaviya Maran Finally Smiles After Seeing SRH Player Abdul Samad Hits Six

దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా ప్రస్తుతం దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్లు తలపడున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ పరుగులు చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవ‌ర్లలలో 9 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. సన్‌రైజర్స్‌ తరఫున అబ్దుల్ స‌మ‌ద్ (28; 21 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్. స‌మ‌ద్‌తో పాటు ఆఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ ర‌షీద్ ఖాన్ (22; 19 బంతుల్లో 2x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. అయితే ఈ మ్యాచులో ఓ అద్భుతం జరిగింది.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సన్​రైజర్స్​కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ డకౌట్ అయ్యాడు. వృద్ధిమాన్‌ సాహా (18), కేన్ విలియమ్సన్ (18) ఆకట్టుకోలేకపోయారు. ఆపై మనీశ్‌ పాండే (17), కేదార్‌ జాదవ్‌ (3), జాసన్‌ హోల్డర్‌ (10) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్ సీఈవో కావ్య మారన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కావ్య ఏడుపు మొహం పెట్టారు. వికెట్ పడినప్పుడల్లా కెమెరాలన్నీ ఆమె వైపు వెళ్లాయి. అయితే అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్ మొదటి బంతికి అబ్దుల్ స‌మ‌ద్ ఓ అద్భుత బౌండరీ బాదడంతో.. కావ్య మొహంలో నవ్వు వచ్చింది. అప్పటివరకు నిరాశగా ఉన్న కావ్య.. సంతోషంలో చప్పట్లు కొడుతూ చిరునవ్వు నవ్వారు. స్టేడియంలో కావ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్ సీఈవో కావ్య మారన్ నవ్వుతున్న ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'హమ్మయ్య.. ఎట్టకేలకు కావ్య పాప నవ్విందోచ్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అబ్బా సాయిరాం.. కావ్య మారన్ ఈరోజు నవ్వింది' అని మరొకరు ట్వీట్ చేశారు. 'పాప నవ్వింది', 'ఇగ మాములుగా ఉండదు పార్టీ', 'చివరగా ఆమె ముఖం మీద చిరునవ్వు వచ్చింది. థాంక్స్ అబ్దుల్ సమద్' అంటూ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

29 ఏళ్ల కావ్య మారన్ మరెవరో కాదు.. త‌మిళ‌నాడు మీడియా కింగ్ క‌ళానిధి మార‌న్ ఏకైక కూతురు. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానల్స్‌కు సీఈవో. స‌న్ నెట్‌వ‌ర్క్ చానెల్స్ బిజినెస్‌లోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. స‌న్‌రైజ‌ర్స్ మ్యాచులలో కావ్య మారన్.. తన అందచందాలతో అందరి కళ్లను తనవైపుకు తిప్పుకున్నారు. స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు.. బౌండరీలు, సిక్సులు బాదినప్పుడు ఆమె చేసే సెలెబ్రేషన్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా హీరోయిన్ తలపించేలా ఉన్న కావ్య.. ప్రతీ మ్యాచ్‌లో తనదైన అందంతో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు.

కావ్య మారన్ తొలిసారి 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో కనిపించారు. కోల్‌క‌తా నైట్ ‌రైడ‌ర్స్ మ్యాచ్‌లో ఆమె క‌నిపించి సందడి చేశారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. కెమెరాలు ఆ అమ్మాయినే పదేపదే క్యాప్చర్ చేశాయి. ఇక ఐపీఎల్ తొలి దశలో మ్యాచులు జరుగుతుండగా స్టాండ్స్‌లో కూర్చొని సన్‌రైజర్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేశారు. రెండో దశలో కూడా ఆమె మ్యాచులను చూస్తున్నారు.

Story first published: Wednesday, September 22, 2021, 23:22 [IST]
Other articles published on Sep 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+