Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: టాస్ ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. లూయిస్, మోరిస్‌లకు షాక్! ఒక మార్పుతో బరిలోకి ఢిల్లీ!!

DC vs RR playing 11 is Out: Evin Lewis and Chris Morris miss out; Shamsi and Miller are in

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్ది సేపట్లో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఎవిన్ లూయిస్, క్రిస్ మోరిస్ స్థానాల్లో టాబ్రిజ్ షంసి మరియు డేవిడ్ మిల్లర్ జట్టులోకి వచ్చారు. ఢిల్లీ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయాపడిన మార్కస్ స్టోయినిస్ స్థానంలో లలిత్ యాదవ్ మ్యాచ్ ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ ఐదవ స్థానంలో ఉంది. ఢిల్లీ ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. రాజస్థాన్ 8 మ్యాచులు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే అందుకుని 8 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచులో ఆక్షర్ పటేల్‌పై సంజు శాంసన్ పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. అక్షర్ బౌలింగ్‌లో శాంసన్ 48 బంతుల్లో 51 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు ఔట్ అయ్యాడు. మరోసారి వీరిద్దరి మధ్య పోరాటాన్ని చూడొచ్చు. రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్.. ఢిల్లీపై 13.42 సగటుతో 19 వికెట్లు సాధించాడు. అయితే అతడికి ఈ మ్యాచులో చోటు దక్కలేదు.

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ 12 విజయాలు అందుకోగా.. ఢిల్లీ 11 విజయాలను నమోదు చేసింది. ఇక యూఏఈలో తలపడిన రెండు సార్లు ఢిల్లీనే విజయం సాధించింది. షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం యూఏఈలోనే పెద్ద క్రికెట్ మైదానం. కాబట్టి బౌండరీలు రావడం కాస్త కష్టమే. దాంతో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు తక్కువగానే ఉంది. ఇప్పటికే జరిగిన 24 మ్యాచులను పరిశీలిస్తే.. 159 తొలి ఇన్నింగ్స్‌లో యావరేజ్‌ స్కోర్‌. ఈ సీజన్ ఐపీఎల్‌లో అబుదాబిలో ఛేజింగ్‌కే అన్ని జట్లు మొగ్గుచూపుతున్నాయి. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు 15 సార్లు విజయం సాధించగా.. ఓడిన జట్లు 9 సార్లు మాత్రమే గెలుపొందాయి.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్, కెప్టెన్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రహమాన్, టాబ్రిజ్ షంసి.

Story first published: Saturday, September 25, 2021, 15:28 [IST]
Other articles published on Sep 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+