Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన హాట్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో వెల్లడించిన రష్మిక

ముంబై: ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇవ్వాళ ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది 50వ మ్యాచ్. అలాగే ఢిల్లీకి లైఫ్ అండ్ డెత్ గేమ్ కూడా. గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.

వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఈ జట్టు- తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆర్సీబీతో సహా అన్ని మ్యాచ్‌లనూ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఢిల్లీ కేపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ వ్యవహారం గుర్తుకొస్తుంది. ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఢిల్లీ కేపిటల్స్ ఓడిన విషయం తెలిసిందే.

RCB Team

ఆ సందర్భంగా విరాట్ కోహ్లీ దూకుడుగా వ్యవహరించాడు. సౌరవ్ గంగూలీతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. గంగూలీ బీసీసీఐ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ టీమిండియా కేప్టెన్సీని వదులుకోవడం దీనికి ఓ కారణం. సొంత గ్రౌండ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 34 బంతుల్లో ఒక సిక్స్, ఆరు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం గంగూలీతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ దూకుడే విరాట్ కోహ్లీకి ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. లక్షలాది మంది అతనికి అభిమానులు అయ్యారు. వారిలో ఎంతోమంది సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్య 50కి చేరిన నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక ఎపిసోడ్‌ను షూట్ చేసింది.

Rashmika Mandanna Virat Kohli

సారా అలీఖాన్, రష్మిక మందన్న, అర్జున్ కపూర్.. వంటి కొంతమంది సెలెబ్రిటీల ఒపీనియన్స్‌ను తీసుకుంది. క్రికెట్ పట్ల వారికి ఉన్న టేస్ట్‌ను అడిగి తెలుసుకుంది. వారి ఫేవరెట్ క్రికెటర్ గురించి ఆరా తీసింది. రాండమ్‌గా బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ విరాట్ కోహ్లీకి ఓటేశారు. తన ఫేవరెట్ హాట్ క్రికెటర్ విరాట్ సర్.. అంటూ వీడియో బైట్ ఇచ్చింది రష్మిత. అతణ్ని స్వాగ్గర్‌గా అభివర్ణించింది.

Story first published: Saturday, May 6, 2023, 13:01 [IST]
Other articles published on May 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+