For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC VS RCB: కృనాల్ సాయంతో కోహ్లీ రివెంజ్ - మాడిపోయిన కేఎల్ ముఖం!

DC VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన కీలక మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ అదరగొట్టింది. విజయంలో బ్యాటుతో కోహ్లీ(51), కృనాల్ పాండ్య (73), బంతితో భువనేశ్వర్ కుమార్, హెజిల్ వుడ్ కీలకంగా వ్యవహరించారు. కాగా, రీసెంట్ గా ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది ఏడో విజయం.

163 పరుగుల లక్ష్య ఛేదనను ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 165 రన్స్ చేసింది. ఛేదనలో ఆర్సీబీకి మంచి ఆరంభం దక్కలేదు. జకోబ్ బెథెల్ (6 బంతుల్లో 12 1 ఫోర్ల, 1 సిక్స్ ) దూకుడుగా ఆడి త్వరగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (0), రజత్ పటీదార్ (6) విఫలమయ్యారు. కానీ విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు), కృనాల్ పాండ్య (47 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 73 రన్స్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది ఆరో అర్ధ శతకం కావడం విశేషం. ఆఖర్లో టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 19 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అక్సర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. దష్మంత్ చమీర ఓ వికెట్ పడగొట్టాడు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (11 బంతుల్లో 28 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సులు) దూకుడుగా ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఫాఫ్ డుప్లెసిస్ (26 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే హేజిల్‌వుడ్ ఈ జోడిని విడదీసి ఆర్సీబీకి మొదటి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత క‌రుణ్ నాయ‌ర్‌(4)ను య‌శ్ ద‌యాల్ ఔట్ చేశాడు. దీంతో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి దశలో కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు) వచ్చి పరుగులు చేయడానికి కాస్త తడబడ్డాడు. అక్సర్ పటేల్ (13 బంతుల్లో 15) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్ సాయంతో 34 పరుగులు) మంచి ప్రదర్శన చేశాడు. విప్రాజ్ నిగమ్ (12) పరుగులు చేశారు. దీంతో దిల్లీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 162 పరుగులు చేసింది. ర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3/33, జోష్ హెజిల్ వుడ్ 2/36, యశ్ దయాల్, కృనాల్ పాండ్య తలో వికెట్ దక్కించుకున్నారు.
DC VS RCB Krunal Pandya Virat kohli Half centuries helps RCB won by 6 wickets against DC
Story first published: Sunday, April 27, 2025, 23:34 [IST]
Other articles published on Apr 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+