Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RCB: జ్వరం కారణంగా ఆర్సీబీకి కీలక ఆటగాడు దూరం

DC vs RCB: ఐపీఎల్ 2025లో భాగంగా 46వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి భారత కీలక క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పై ఉంటుంది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ దృష్టిని ఆకర్షించనున్నారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ లో ఒక మార్పు జరిగింది. జ్వరం కారణంగా ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో జాకబ్ బెతెల్ కు అవకాశం లభించింది. ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.

పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానం
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది, వాటిలో వారు 6 మ్యాచ్‌ల్లో గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. 12 పాయింట్లతో ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.

DC vs RCB Key RCB Player Missing Due to Fever in IPL 2025 Match

తుది జట్లు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెతెల్, రజత్ పాటిదార్ (c), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, స్వప్నిల్ సింగ్

హెడ్ ​​టు హెడ్ రికార్డ్
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఆర్సీబీ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.

Story first published: Sunday, April 27, 2025, 19:26 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+