For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC VS RCB: భువి టెర్రిఫిక్ బౌలింగ్ - వణికిన కేఎల్ రాహుల్!

DC VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా జరుగుతోన్న కీలక మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ 162 స్కోర్ చేసింది. ఆర్సీబీ ముందు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మిడిల్ ఓవర్లలో అంతగా పరుగులు రాలేదు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ మంచి ప్రదర్శన చేయడంతో ఈ మాత్రం స్కోరు చేసింది. జట్టుకు మంచి ఫినిష్ అందించాడు. తన ఎఫీషియన్సి బ్యాటింగ్ మంచి షాట్లు ఆడాడు. ఆర్సీబీ బౌలర్లు కూడా మంచి ఎఫర్ట్ ఇచ్చారు.

తడబడిన కేఎల్ రాహుల్..
దిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (11 బంతుల్లో 28 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సులు) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీడులో ఉండలేకపోయాడు. ఫాఫ్ డుప్లెసిస్ (26 బంతుల్లో 22; 2 ఫోర్లు) నామమాత్రపు పురగులు చేశాడు. హేజిల్‌వుడ్ వీరిద్దరిని విడ‌దీసి ఆర్సీబీకి బ్రేకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న క‌రుణ్ నాయ‌ర్‌(4)ను య‌శ్ ద‌యాల్ పెవిలియన్ పంపాడు. 44 పరుగులకే రెండు వికెట్లు ప‌డిన సమయంలో వచ్చిన కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు) పరుగులు చేయడానికి కాస్త కష్టపడ్డాడు. తడబడుతూ ఆడాడు. అక్సర్ పటేల్ (13 బంతుల్లో 15), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్ సాయంతో 34 పరుగులు), విప్రాజ్ నిగమ్ (12) పరుగులు చేశారు. దీంతో దిల్లీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది.

DC VS RCB IPL 2025 KL rahul struggled Delhi Capitals sets target 164 runs for rcb

ఆర్సీబీ బౌలర్లు భళా..
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3/33 టెర్రిఫిక్ బౌలింగ్ చేశాడు. జోష్ హెజిల్ వుడ్ 2/36 సూపర్ బౌలింగ్ చేశాడు. ప్రారంభంలో కాస్త ఎక్కువ పరుగులు సమర్ఫించుకున్నా, తర్వాత బాగా వికెట్లు తీశారు. యశ్ దయాల్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, April 27, 2025, 21:36 [IST]
Other articles published on Apr 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+