Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs PBKS: సమీర్ రిజ్వీ ఊచకోత.. పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ షాక్

DC vs PBKS: ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది.గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత పంజాబ్ కింగ్స్ కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఢిల్లీ జట్టు తరఫున సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్ బ్యాటింగ్ తో అద్భుత విజయాలు సాధించారు.

యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ ఐపీఎల్‌లో తన తొలి అర్థ సెంచరీ సాధించాడు. రిజ్వీ 22 బంతుల్లో50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో రిజ్వీ 3 ఫోర్లు , 5 సిక్సర్లు కొట్టాడు. కరుణ్ నాయర్ 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్ 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఢిల్లీ ఓపెనర్లు కేఎల్ రాహుల్(35), ఫాఫ్ డుప్లెసిస్(23) శుభారంభం అందించగా.. సెథిఖుల్లా అటల్(22) పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబె తలో వికెట్ తీశారు.

DC vs PBKS Sameer Rizvi s Power Show Stuns Punjab Kings in IPL 2025 Thriller

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీస్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ తరఫున మార్కస్ స్టొయినీస్ 16 బంతుల్లో అజేయంగా 44 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించారు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ లో స్టొయినీస్ 4 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి పంజాబ్‌ను 200 పరుగుల మార్కును దాటేలా చేశాడు. పంజాబ్ తరఫున నేహాల్ వధేరా(16), శశాంక్ సింగ్(11) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, కుల్దీప్ యాదవ్ 2, విప్రజ్ నిగమ్ 2, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.

ఈ నేపథ్యంలోౌ ఢిల్లీ జట్టు ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో గెలుచుకుని తన గౌరవాన్ని కాపాడుకుంది. అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, పంజాబ్ కింగ్స్ టాప్ 2కి చేరుకోవాలనే కల చాలా కష్టంగా మారింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు మే 26న ముంబై ఇండియన్స్‌తో ఆడాలి.

Story first published: Saturday, May 24, 2025, 23:56 [IST]
Other articles published on May 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+