Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs PBKS: టాస్ గెలిచిన ఢిల్లీ.. స్టార్ ప్లేయర్ దూరం

DC vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఢిల్లీ జట్టుకు ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్షర్ పటేల్ అనారోగ్యానికి గురికావడంతో ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీ జట్టుకు డుప్లెసిస్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో మార్పులు జరిగాయి. మిచెల్ ఓవెన్ స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినీస్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు బదులు హ‌‌ర్‌ప్రీత్ బ్రార్ ను జట్టులోకి తీసుకున్నారు.

DC vs PBKS Delhi Wins Toss Star Player Axar Patel Misses Out Due to Illness

తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రవీణ్ దూబే, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, కైల్ జేమీసన్, జేవియర్ బార్ట్‌లెట్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: కేఎల్ రాహుల్, మన్వంత్ కుమార్, త్రిపూర్ణ విజయ్, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే

Story first published: Saturday, May 24, 2025, 19:29 [IST]
Other articles published on May 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+