Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: ఢిల్లీ జట్టుకు కీలక ప్లేయర్ దూరం.. తుది జట్లు ఇవే..

DC vs MI: ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఢిల్లీ జట్టు ఐదో విజయం కోసం ఎదురుచూస్తుండగా.. ముంబై రెండో విజయం కోసం ఎదురుచూస్తోంది. టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముంబై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

అక్షర్ ఏం చెప్పాడు?
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయనున్నామని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో ఢిల్లీలో మొదటి మ్యాచ్ కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో తెలియదన్నారు. గతంలోని సంఖ్యలను ఎక్కువగా నమ్మలేమని అక్షర్ చెప్పుకొచ్చాడు. ప్రణాళికను సరిగ్గా అనుసరించడం చాలా ముఖ్యమని చెప్పాడు. ఫాఫ్ డుప్లెస్ గాయపడి ఈ మ్యాచ్ కు దూరమయ్యాడని అక్షర్ పటేల్ స్పష్టం చేశాడు.

DC vs MI Key Player Missing for Delhi Playing XIs Announced

హార్దిక్ ఏం చెప్పాడు?
ముంబై జట్టులో అనుభవానికి లోటు లేదని.. మనం చేస్తున్న తప్పులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. మేము మంచి ఆటకు చాలా దూరంలో లేమని చెప్పుకొచ్చాడు. మన దగ్గర తప్పు జరగడానికి పెద్దగా ఆస్కారం లేదు, ఈ రాత్రికి అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు.

తుది జట్లు ఇవే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా, దుష్మంత చమీరా

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వనీ కుమార్, రాజ్ బావా, కర్ణ్ శర్మ

Story first published: Sunday, April 13, 2025, 19:31 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+