Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా 9 ఏళ్ల కూతురు కోసమే ఇలా చేశా..!: ముంబయి 'కర్ణ్'డు

Mumbai Indians: విజయానికి ఆఖరి 9 బంతుల్లో మరో 15 పరుగులు అవసరం. దీంతో ముంబయి ఇండియన్స్ పై ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ దే విజయం అని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కథ మారిపోయింది. గెలుపు ముంగిట ఉన్న దిల్లీకి రనౌట్లు కొంప ముంచాయి. వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్‌ అవ్వడంతో దిల్లీ కథ ముగిసి.. ముంబయి విజయం సాధించింది.

అయితే ఈ విజయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కర్ణ్‌ శర్మ కూడా (3/36) అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను ముంబయి వైపునకు తిప్పాడు. ముంబయి ఇండియన్స్.. 13వ ఓవర్ ముగిసిన తర్వాత బంతిని మార్చి బౌలింగ్ కు దిగింది. అయితే ఆ బంతికి మంచి గ్రిప్ దొరకడం వల్ల, కర్ణ్ శర్మకు అది అనుకూలంగా మారింది.

దీంతో ఆ తర్వాతి ఓవర్‌లోనే కర్ణ్.. ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేశాడు. అనంతరం వెంటనే కేఎల్ రాహుల్ ను కూడా పెవిలియన్ పంపి మ్యాచును ముంబై వైపునకు టర్న్ చేశాడు. అప్పటికే ముందుగా కర్ణ్.. అభిషేక్ పోరెల్ వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో అతడు మూడు వికెట్లు పడగొట్టి ముంబయి విజయంలో కీలకంగా వ్యవహరించాడు.

DC VS MI karn sharma says my daughter is 9 years old she s my inspiration after MI won against DC

మ్యాచ్ విజయం అనంతరం కర్ణ్ మాట్లాడుతూ.. "నా కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా నా వంతు కృషి చేయాలని కోరుకుంటాను. ఇది పెద్ద టోర్నమెంట్. కేవలం 12 మంది మాత్రమే ఆడగలరు. నేను నా ప్రాక్టీస్ పై మాత్రమే దృష్టి పెట్టగలను. మిగిలినవి నా చేతుల్లో లేవు. కేఎల్ రాహుల్ వికెట్ నా ఫేవరెట్. ఆ సమయంలో ఆ క్యాచ్ ఎంతో కీలకమైంది. అవకాశం వచ్చినప్పుడు బాగా ఆడాలని, జట్టు గెలవాలని నేను ఎంతో ప్రార్థిస్తాను. మొదటి ఇన్నింగ్స్‌లో మంచు లేదు, బంతిని మార్చడం వల్ల మాకు కొంత ఎక్కువ గ్రిప్ లభించింది. అది మంచి విషయం." అని కర్ణ్ చెప్పుకొచ్చాడు.

తన కోసమే ఇదంతా..
కర్ణ్ శర్మ.. తన చిన్నారి కూతురు కోసమే ఆడుతున్నట్లు చెప్పాడు. ఆ చిన్నారే తన స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. "నా కూతురు వయసు 9 సంవత్సరాలు, ఆమెనే నాకు స్ఫూర్తి. ఆమెను చూసే బాగా ఆడాలని, ఆమె కోసం మ్యాచ్‌లు గెలవాలని నాకు ప్రేరణ వస్తుంది." అని కర్ణ్ శర్మ పేర్కొన్నాడు.

Story first published: Monday, April 14, 2025, 15:48 [IST]
Other articles published on Apr 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+