Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం.. ముంబైకు భారీ టార్గెట్

ఐపీఎల్-2024 సీజన్‌లో మరో భారీ స్కోరు. సొంతమైదానంలో ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విధ్వంసం సృష్టించిది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు 2011లో పంజాబ్‌పై చేసిన 231/4 స్కోరే అత్యధికంగా ఉండేది.

జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (84; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.

Delhi Capitals scored 257 runs after losing four wickets in 20 overs

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే ఆరంభం దక్కింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ధాటికి స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. తొలి ఓవర్ నుంచే ఫ్రేజర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ల్యూక్ వుడ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాది మొదటి ఓవర్‌లో 19 పరుగులు రాబట్టుకున్నాడు. బుమ్రాను కూడా ఫ్రేజర్ వదిలిపెట్టలేదు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు.

ఫ్రేజర్ ధాటికి నువాన్ తుషార 18, హార్దిక్ పాండ్య 20 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఫ్రేజర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డును రెండో సారి సాధించాడు. గతంలో ఈ రికార్డు అతని పేరిటే ఉంది.

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఫ్రేజర్‌ను పీయూష్ చావ్లా ఔట్ చేశాడు. ఆ తర్వాత ముంబై బౌలర్లు స్పీడ్ పెంచారు. మరో ఓపెనర్ అభిషేక్ పోరల్ (36; 27 బంతుల్లో, 3x4, 1x6)ను కూడా స్పల్పవ్యవధిలోనే నబీ ఔట్ చేయడంలో ఢిల్లీ 10 ఓవర్లలో 128/2తో నిలిచింది. ఈ దశలో క్రీజులో వచ్చిన షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) బ్యాటు ఝుళిపించడంతో ఢిల్లీ తిరిగి పుంజుకుంది.

హోప్ ఔటైనప్పటికీ పంత్‌తో కలిసి స్టబ్స్ అదే జోరును కొనసాగించాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 27 బంతుల్లో 55 పరుగులు చేశారు. ల్యూక్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో స్టబ్స్ అయిదు బౌండరీలు, ఓ సిక్సర్ బాది 26 పరుగులు సాధించాడు.

Story first published: Saturday, April 27, 2024, 17:31 [IST]
Other articles published on Apr 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+