Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్: అతను తిరిగొచ్చాడు

ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ పోరు ఢిల్లీకి డూ ఆర్ డై మ్యాచ్. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ సేన తప్పక విజయం సాధించాలి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను మెరుగుపర్చుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో ఓడితే లక్నో తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. 12 మ్యాచ్‌లు ఆడిన లక్నో కూడా ఆరు విజయాలు సాధించింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు తక్కువగా ఉండటంతో పట్టికలో ఢిల్లీ కంటే కింద స్థానంలో నిలిచింది.

DC vs LSG myself and Naib come in Warner misses out- Rishabh Pant

అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా గత మ్యాచ్‌లో నిషేధానికి గురైన పంత్ ఇవాళ తిరిగొస్తున్నాడు. పంత్ రాక ఢిల్లీకి మరింత బలాన్ని చేకూరుస్తోంది. పిచ్ విషయానికొస్తే ఇది బ్యాటింగ్‌కు అనుకూలం. అంతేగాక బౌండరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. ఓ వైపు 60 మీటర్లు, మరో వైపు 66 మీటర్ల దూరంలో బౌండరీ లైన్ ఉంది. దీంతో భారీ స్కోరు నమోదవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మైదానంలో జరిగిన గత మ్యాచ్‌‌‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.

కాగా, టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. తమ జట్టులో యువ బౌలింగ్ లైనప్ ఉందని, ఒత్తిడిని అనుభవం ఉన్న తమ బ్యాటర్లు జయిస్తారనే ఉద్దేశంతో ఛేజింగ్ ఎంచుకున్నామని అన్నాడు. ''మేం ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. గత మ్యాచ్‌లో మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. బౌలర్లు ధైర్యంగా ఉండాలి. జట్టులో కొన్ని మార్పులు చేశాం'' అని రాహుల్ అన్నాడు.

ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ''మేం టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. ప్లేఆఫ్స్ క్వాలిఫై గురించి ఆలోచించట్లేదు. మ్యాచ్ గెలవడంపై దృష్టి సారిస్తున్నాం. బయట నుంచి ఎన్నో సలహాలు, సూచనలు వస్తుంటాయి. కానీ మా ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం . మా ప్లేయర్లు అదే పని చేస్తున్నారు. జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వార్నర్ తుదిజట్టులో లేడు. నేను, నాయిబ్ జట్టులోకి వచ్చాం'' అని అన్నాడు.

తుది జట్టు
లక్నో సూపర్ జెయింట్స్: డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), స్టొయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, యుద్విర్ సింగ్, మోహ్సిన్ ఖాన్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్

ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, రిషభ్ పంత్ (కెప్టెన్), షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, గుల్బాదిన్ నయిబ్, రసిక్‌దర్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.

Story first published: Tuesday, May 14, 2024, 19:18 [IST]
Other articles published on May 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+