Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs LSG: రాణించిన మార్‌క్రమ్, మార్ష్.. ఢిల్లీ ముంగిట స్వల్ప లక్ష్యం

DC vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా 40వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్నో జట్టు తరఫున ఓపెనర్లు ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ లు శుభారంభం అందించారు. ఐడెన్ మార్‌క్రమ్ 33 బంతుల్లో 52 పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఆయుష్ బధోని 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు.

DC vs LSG Aiden Markram Mitchell Marsh Shine as Lucknow Set a Target of 160 for Delhi

ఆయుష్ బధోని చివరకి కాస్త బ్యాట్ ఝులిపించడంతో లక్నో జట్టు 159 పరుగులు చేయగలిగింది. నికోలస్ పూరన్(9), అబ్దుల్ సమద్(2), డేవిడ్ మిల్లర్(14) అంతగా రాణించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ముకేష్ కుమార్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ ఒక కీలక వికెట్ ను పడగొట్టాడు. నికోలస్ పూరన్ ను బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపాడు. దుష్మంత చమీర కూడా ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, April 22, 2025, 21:26 [IST]
Other articles published on Apr 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+