DC vs LSG: గతేడాది నిర్వహించిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా తన ఖజానాను ఖాళీ చేశాడు. లక్నో ఫ్రాంచైజీ రిషబ్ పంత్ ను రూ.27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా పంత్ నిలిచాడు. అయితే రిషబ్ పంత్ తన కొత్త ఫ్రాంచైజీ కోసం ఆడిన మొదటి మ్యాచ్ లోనే పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మూడు కీలక తప్పులు చేశాడు. దాని కారణంగా లక్నో ఇప్పటికే గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమి పాలైంది.
మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ చేసిన రిషబ్ పంత్
చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 6 పరుగులు అవసరం. ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయింది. అశుతోష్ శర్మ కూడా నాన్-స్ట్రెకర్ ఎండ్ లో నిలబడ్డాడు. మోహిత్ శర్మ క్రీజులో ఉన్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన చివర్ ఓవర్ తొలి బంతికే మోహిత్ శర్మ బంతిని ఆడేందుకు క్రీజు నుంచి బయటకు వచ్చాడు. కానీ బంతి మిస్ అయి కీపర్ రిషబ్ పంత్ వద్దకు వెళ్లింది. కానీ రిషబ్ పంత్ బంతిని పట్టుకోలేకపోయాడు. అందుకే మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రిషబ్ పంత్ మోహిత్ ను స్టంపౌవుట్ చేసి ఉంటే లక్నో జట్టు మ్యాచ్ గెలిచి ఉండేది.

శార్దూల్ ఠాకూర్‌కు మరో రెండు ఓవర్లు ఇవ్వాల్సింది..
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే శార్దూల్ రెండు పెద్ద వికెట్లను పడగొట్టాడు. శార్దూల్ రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ పవర్ ప్లే తర్వాత శార్దూల్ ఠాకూర్ కు మళ్లీ బౌలింగ్ అవకాశాన్ని కెప్టెన్ రిషబ్ పంత్ ఇవ్వలేదు. శార్దూల్ ఫామ్ లో ఉండడంతో ఈ నిర్ణయం పంత్ కు ఖరీదైనదిగా మారింది. రిషబ్ పంత్ శార్దూల్ కు బౌలింగ్ అవకాశం ఇచ్చి ఉంటే వికెట్లు తీసేవాడు. ఈ క్రమంలో పంత్ శార్దూల్ కు బౌలింగ్ అవకాశం ఇవ్వకపోవడంతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.
అశుతోష్ శర్మ క్యాచ్ వదిలేయడం
అశుతోష్ శర్మ క్యాచ్‌ను రిషబ్ పంత్ వదిలేశాడు. ఆ సమయంలో అశుతోష్ శర్మ 19 బంతుల్లో 19 పరుగులు చేసి ఉన్నాడు. ఈ క్యాచ్ వదిలేయడం లక్నో జట్టును మ్యాచ్ ఓడిపోయేలా చేసింది. అశుతోష్ చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసి విజయాన్ని సాధించిన అనంతరం పెవిలియన్ కు తిరిగి వచ్చాడు. అశుతోష్ శర్మ సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.