
హైదరాబాద్: ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఫిరోజ్ షాకోట్లా వేదికగా శనివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఢిల్లీ లక్ష్య చేధనలో శిఖర్ ధావన్ 41 బంతుల్లో 56(7 ఫోర్లు, ఒక సిక్స్), శ్రేయాస్ అయ్యర్ 49 బంతుల్లో 58(5 ఫోర్లు, ఒక సిక్స్)లు హాఫ్ సెంచరీలో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఢిల్లీ టార్గెట్ 164
అంతకముందు క్రిస్‌గేల్ 37 బంతుల్లో 69(6 ఫోర్లు, 5 సిక్సులు), మన్దీప్ సింగ్ 27 బంతుల్లో 30(ఫోర్, సిక్స్) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటంగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు 164 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్(12) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(2), డేవిడ్ మిల్లర్(7)లు కూడా విఫలం కావడంతో పంజాబ్ 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రిస్ గేల్, మన్దీప్ సింగ్‌లు నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత క్రిస్ గేల్ 37 బంతుల్లో 69(6 ఫోర్లు, 5 సిక్సులు) అక్సర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత శామ్ కరన్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మరో 23 పరుగుల వ్యవధిలో మన్దీప్ సింగ్(30) కూడా ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ ఔటైన తర్వాత పంజాబ్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది.
చివర్లో అశ్విన్(16), హర్‌ప్రీత్ బ్రార్ 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లామిచానే మూడు వికెట్లు సాధించగా, కగిసో రబాడ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.