Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR: రాణించిన కోల్‌కతా బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక ప్లేఆఫ్స్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల బౌలింగ్ లో దూకుడుగా ఆడారు. ఓవనర్లలో సునీల్ నరైన్ 27 పరుగులు చేయగా.. రహ్మానుల్లా గుర్బాజ్ 26 పరుగులు చేశాడు. దాంతో కోల్‌కతా పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయగలిగింది. కోల్ కతా వేగంగా పరుగులు చేస్తున్న సమయంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జోడీని విడదీసి తొలి వికెట్ సాధించాడు. గుర్బాజ్ ఔటైన తర్వాత సునీల్ నరైన్ విప్రజ్ నిగమ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే(26), అంగ్ క్రిష్ రఘువంశీ(44) అద్భుతంగా ఆడారు. అక్షర్ పటేల్ రహానే, వెంకటేశ్ అయ్యర్(7)లను ఔట్ చేసి కోల్ కతా జట్టును కష్టాల్లోకి నెట్టాడు.

DC vs KKR KKR Sets 204-Run Target with Explosive Batting in IPL 2025 Clash

అనంతరం కోల్‌కతా బాధ్యతను రఘువంశీ తీసుకున్నాడు. బౌండరీలతో రెచ్చిపోయి జట్టు స్కోరును 150 దాటించాడు. హాఫ్ సెంచరీగా దగ్గరగా వెళ్లిన రఘువంశీని చమీర పెవిలియన్ కు పంపాడు. రఘువంశీ అజింక్యా రహానే, రింకూ సింగ్(36)లతో కలిసి పార్టనర్ షిప్ ను నెలకొల్పాడు. 18వ ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ ను విప్రజ్ ఔట్ చేశాడు. అనంతరం ఆండ్రీ రస్సెల్(17), పావెల్(5), చివరలో ఆడారు. మిచెల్ స్టార్క్ 20వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ తొలి బంతినే సిక్సర్ బాదాడు. రస్సెల్ సిక్సర్ బాదడంతో కోల్ కతా జట్టు 200 మార్కును దాటింది.

ఆ ఓవర్లో మూడో బంతికే పావెల్ ఎల్బీగా వెనుదిరగగా.. నాలుగో బంతికి అనుకుల్ రాయ్(0)ని చమీర డైవింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. ఐదో బంతికి రస్సెల్ రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోల్ కతా జట్టు 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. విప్రజ్ నిగమ్ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు పడగొట్టగా.. చమీర ఒక వికెట్ తీశాడు.

Story first published: Tuesday, April 29, 2025, 21:52 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+