DC vs KKR Dream11 :డ్రీమ్11 టీమ్..కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 చివరి అంకానికి చేరుకుంది. బుధవారం (అక్టోబర్ 13) ఫైనల్ కానీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. ఓడిన టీమ్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమింస్తుంది. లీగ్‌ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి.. క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఢిల్లీ తుదిపోరుకు చేరాలని తహతహలాడుతోంది.

ఇక నాకౌట్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఇంటి దారి పట్టించిన కోల్‌కతా అదే జోరులో టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. క్రికెట్ ప్రేమికులు కూడా ఈ మెగా సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెన్నై ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు శుక్రవారం జరుగనున్న టైటిల్ పోరులో ధోనీసేనతో తలపడనుంది.

రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌గా అతడే ఉండాలి: ఎంఎస్‌కేరవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌గా అతడే ఉండాలి: ఎంఎస్‌కే

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ షార్జా క్రికెట్ మైదానంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకి ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు.

ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ ఢిల్లీ, కోల్‌కతా జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలోనూ ఈ రెండు జట్లూ రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న షార్జా పిచ్‌ స్పిన్‌కి అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్‌ జరిగే కొద్దీ నెమ్మదించే ఈ పిచ్‌పై బంతి బాగా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు.

ఆ త్రయం చెలరేగితేనే

ఆ త్రయం చెలరేగితేనే

లీగ్‌ దశలో అన్ని జట్లన్నింటికంటే ఎక్కువ విజయాలు సాధించి ఢిల్లీనే. ఆలాంటి జట్టు క్వాలిఫయర్‌-1లో ఒత్తిడిని జయించలేక ఓడిపోయింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ కీలక సమయంలో ఫామ్‌ కోల్పోయాడు. పృథ్వీ ఫామ్‌ అందుకోవడం సంతోషాన్నిచ్చే విషయమే. ఈ ఇద్దరు మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్, శిమ్రాన్ హెట్‌మయర్‌ మెరుపులు ఒక్కో మ్యాచుకే పరిమితం అయ్యాయి. ఈ త్రయం చెలరేగాల్సిన అవసరం ఎంతో ఉంది. మార్కస్ స్టాయినిస్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టుకు సమతూకం వస్తుందని ఢిల్లీ చూస్తోంది.

కానీ అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. ఒకవేళ ఫిట్‌గా ఉంటే టామ్‌ కరన్‌పై వేటుపడనుంది. బ్యాటింగ్‌ విభాగం బలంగా ఉండాలనుకుంటే స్టీవ్‌ స్మిత్‌ను ఆడించే అవకాశాలను కూడా ఉన్నాయి. మరోవైపు స్పిన్‌ పిచ్‌ల మీద ఆర్ అశ్విన్‌ విఫలమవుతున్నాడు. అయితే కోల్‌కతా జట్టులో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొనసాగవచ్చు. అక్షర్‌ పటేల్, అన్రిచ్ నోర్జ్‌, అవేష్‌ ఖాన్ నిలకడగా రాణిస్తుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే రబాడ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మాత్రం ఢిల్లీకి తిరుగుండదు.

వెంకటేశ్‌, నరైన్‌ రాణిస్తే

వెంకటేశ్‌, నరైన్‌ రాణిస్తే

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి వెంకీ అద్భుత ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. క్వాలిఫయర్‌-2లో కూడా ఈ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి.

రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణాలు కూడా కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిపాఠి, రాణాల దూకుడైన బ్యాటింగ్ ప్రత్యర్థికి పెద్ద సవాలే. సీనియర్లు ఇయాన్ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటివరకు తమ సత్తాచాటలేదు. గాయం కారణంగా జట్టుకు దూరమయిన స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ స్థానంలో ఆడిన షకిబ్‌ ఉల్ హాసన్ సత్తాచాటాడు.

తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడిచేశాడు. ఇక షార్జా పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో క్వాలిఫయర్‌-2లో అతడే ఆడనున్నాడు. బౌలింగ్‌ కూడా కోల్‌కతాకు పెద్ద బలం. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ నిలకడగా రాణిస్తున్నారు. వీరికి షకిబ్‌ ఉల్ హాసన్ కూడా తోడయ్యాడు. పేస్‌ విభాగంలో లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి కూడా రాణిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నిలకడ, దూకుడుతో ఆకట్టుకుంటున్న కోల్‌కతాకు ఢిల్లీని ఓడించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్ ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్‌ (కెప్టెన్‌), శిమ్రాన్ హెట్‌మయర్‌, మార్కస్ స్టోయినిస్‌/స్టీవ్‌ స్మిత్‌, అక్షర్‌ పటేల్‌, ఆర్ అశ్విన్‌, అన్రిచ్ నోర్జ్‌, కాగిసో రబాడ/టామ్‌ కరన్‌, అవేష్‌ ఖాన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), షకిబ్‌ ఉల్ హాసన్/ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి.

 డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

శిఖర్ ధావన్, వెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), శుభమాన్ గిల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (కీపర్), సునీల్ నరైన్, అవేష్ ఖాన్ (వైస్ కెప్టెన్), కాగిసో రబాడా, లాకీ ఫెర్గూసన్, అన్రిచ్ నోర్జ్‌.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 13, 2021, 14:27 [IST]
Other articles published on Oct 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X