
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో పవర్ ప్లేలో భారీగా పరుగులు రాబట్టారు. ఆరంభం నుంచే ఇద్దరు ధాటిగా ఆడడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఓపెనర్ పృథ్వీ షా ఫోర్‌తో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం గమనార్హం. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఢిల్లీ 68 పరుగులు చేసింది. దీంతో ఈ సీజన్లో పవర్‌ప్లేలో ఇది మూడో అత్యధిక స్కోర్‌గా నమోదైంది. షా, వార్నర్ ధాటికి ఈ సీజన్‌లో పవర్ ప్లేలో పరుగులు రాకుండా కట్టడి చేస్తూ వికెట్లు తీస్తున్న ఉమేష్ యాదవ్ కూడా చేతులెత్తేశాడు. పవర్‌ప్లేలో అతను వేసిన 2 ఓవర్లలో 20 పరుగులు వచ్చాయి. ఇక ఢిల్లీ కంటే ముందు చెన్నైసూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన టీంలుగా ఉన్నాయి.
లక్నోసూపర్ జెయింట్స్‌పై చెన్నైసూపర్ కింగ్స్ పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ఈ సీజన్లో పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక చెన్నైసూపర్ కింగ్స్‌పై పవర్‌ప్లేలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో తాజా మ్యాచ్‌లో పవర్‌ప్లేలో 68 రన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.
వార్నర్, పృథ్వీ షా ధాటిగా ఆడడంతో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభంలోనే ఎక్కువ మంది బౌలర్లను ఉపయోగించాల్సి వచ్చింది. అయినప్పటికీ వీరి దూకుడు తగ్గలేదు. ఈ క్రమంలో పృథ్వీ షా 7 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలోనే 93 పరుగులు చేశారు. మొత్తంగా 29 బంతుల్లోనే 51 పరుగులు చేసిన పృథ్వీషా.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన పృథ్వీషాకు ఈ సీజన్లో ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి.