DC vs KKR: ఐపీఎల్‌లో 9 ఏళ్ల తర్వాత డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ఒకే ఒక్కడిగా ఘనత

ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఆరంభంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే 9 సంవత్సరాల తర్వాత మళ్లీ ఢిల్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు చివరగా ఏ జట్టుపై వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడో మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై మొదటి హాఫ్ సెంచరీ మార్క్ అందుకోవడం గమనార్హం.

చివరగా 2013లో
9 ఏళ్ల క్రితం డేవిడ్ వార్నర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు 2013లో చివరగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాతి సీజన్ నుంచి డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 8 ఏళ్లపాటు అదే జట్టుతో ఉన్నాడు. ఈ క్రమంలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. కానీ ఈ సీజన్లో మళ్లీ తన పాత టీం ఢిల్లీకి డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

9 ఏళ్ల తర్వాత మళ్లీ
ఈ క్రమంలో రీఎంట్రీలో ఢిల్లీ తరఫున అదే కోల్‌కతానైట్ రైడర్స్‌పై డేవిడ్ వార్నర్ తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో డేవిడ్ వార్నర్ చివరగా ఢిల్లీ తరఫున ఏ జట్టుపై హాఫ్ సెంచరీ సాధించాడో.. రీ ఎంట్రీలోనూ అదే జట్టుపై హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ తరఫున హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన అరుదైన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

కోల్‌కతా ముందు కొండంత లక్ష్యం
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల చెలరేగారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో కోల్‌కతానైట్ రైడర్స్ ముందు 216 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్ 61, పృథ్వీ షా 51, శార్దూల్ 29*, రిషబ్ పంత్ 27, అక్షర్ పటేల్ 22, పావెల్ 8, లలిత్ యాదవ్ ఒక పరుగు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వరుణ్ చక్రవర్తి, రసూల్, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications