Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs GT Toss Update: గుజ‌రాత్‌దే బ్యాటింగ్‌.. ఒక మార్పుతో బ‌రిలోకి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

DC vs GT: Delhi Capitals Won the Toss and Elected Bowl First and Mustafizur replaces Nagarkoti

గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి మొద‌ట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ మెద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతుండ‌గా.. గుజ‌రాత్ టైటాన్స్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతుంది. ఇక ఇరు జ‌ట్లు త‌మ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి ఈ మ్యాచ్‌లో ఫుల్ జోష్‌తో బ‌రిలోకి దిగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో టాస్ గెలిచిన‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ మాట్లాడుతూ ''మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. మాకు భిన్న‌మైన‌ బౌలింగ్ లైనప్ ఉంది. మొదటి గేమ్ తర్వాత ఛేజింగ్ చేయడం మాకు సౌకర్యంగా అనిపించింది. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాం. క‌మ‌లేష్ నగర్కోటి స్థానంలో ముస్తిఫిజ‌ర్ ర‌హ్మామాన్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.'' అని తెలిపాడు.

ఇక గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ''మేం మొద‌ట‌ బ్యాటింగ్ చేయబోతున్నాం. గాలి వీస్తుంది, కాబట్టి మేము మంచును ఆశించము. మేము ఈ మైదానంలోనే శిక్షణ పొందాము. అప్పుడు మంచు పడలేదు. ఇక మొద‌టి మ్యాచ్‌లో బ‌రిలోకి దిగిన జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. పూర్తిగా అదే జ‌ట్టుతో బ‌రిలోకి దిగుతున్నాం.'' అని చెప్పాడు.

తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిట‌ల్స్‌: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీప‌ర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌ ), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్ సదరంగాని, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ

Story first published: Saturday, April 2, 2022, 19:30 [IST]
Other articles published on Apr 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+