DC vs SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేన్ మామ.. నటరాజన్, శంకర్ ఔట్! అయ్యర్ ఇన్!!

DC v SRH: T Natarajan and Vijay Shankar out, Holder in for SRH playing 11

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్ది సేపట్లో దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కరోనా వైరస్ సోకడంతో ఫాస్ట్‌ బౌలర్‌ టీ నటరాజన్‌, ఐసొలేషన్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్ ఈ మ్యాచుకు దూరమయ్యారు. వారి స్థానాల్లో అబ్దుల్ సమద్, ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. డేవిడ్ వార్నర్, జాసన్ హోల్డర్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు.

ఇప్పటిదాకా 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. గతేడాది ఇదే యూఏఈ గడ్డపై ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఢిల్లీ.. ఈ సారి టైటిల్ పట్టాలని చూస్తోంది. మరోవైపు ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఏడు మ్యాచులలో ఒక్క విజయం) యూఏఈలోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుంది. బల బలాలు పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం బోల్తాకొట్టిస్తున్న రషీద్ ఖాన్‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై మంచి రికార్డు ఉంది. ఢిల్లీపై ఇప్ప‌టి వ‌ర‌కూ 11 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్.. 14 వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఉన్న జట్లపై ఇదే అత్యుత్త‌మ రికార్డు. అంతేకాదు ఢిల్లీపై ర‌షీద్ ఎకాన‌మీ 5.63 మాత్ర‌మే. ఢిల్లీపై ఓ బౌల‌ర్ నమోదు చేసిన అత్యుత్త‌మ ఎకాన‌మీ కూడా ఇదే. అందుకే ఈ మ్యాచుకు ముందు ర‌షీద్ గణాంకాలు ఢిల్లీని కలవరపెడుతున్నాయి. అంతేకాదు దుబాయ్‌లోనూ ర‌షీద్‌ ఖాన్‌కు మంచి ఎకాన‌మీ రేటు ఉంది. క‌నీసం 20 ఓవ‌ర్ల‌కుపైగా వేసిన బౌల‌ర్ల‌లో ర‌షీద్‌దే అత్యుత్త‌మ ఎకాన‌మీ రేటు. ఈ నేపథ్యంలో ఢిల్లీపై మరోసారి తన ఆధిపత్యం చెలాయించాలని రషీద్ చూస్తున్నాడు.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), షిమ్రన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్ కెప్టెన్), మనీశ్ పాండే, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 22, 2021, 19:19 [IST]
Other articles published on Sep 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X