Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: చెలరేగిన రబాడ, నోర్జ్.. స్వల్ప స్కోరుకే సన్‌రైజర్స్‌ పరిమితం!!

DC v SRH: Kagiso Rabada, Anrich Nortje strikes keep Sunrisers Hyderabad to 134 for 9

దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ కాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్స్ పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవ‌ర్లలలో 9 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. దాంతో ప్ర‌త్య‌ర్థి ఢిల్లీ కాపిటల్స్‌ ముందు 135 పరుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్‌ తరఫున అబ్దుల్ స‌మ‌ద్ (28; 21 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్. ర‌షీద్ ఖాన్ (22; 19 బంతుల్లో 2x4, 1x6) పర్వాలేదనిపించగా.. డేవిడ్ వార్నర్ (0), కేదార్ జాదవ్ (3) పేలవ ఫామ్ కొనసాగించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబాడ 3, అన్రిచ్ నోర్జే 2, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశారు.

యూఏఈ మైదానాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. గత సీజన్లోని పరాజయాల పరంపర ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌ మొదటి ఎడిషన్‌లో విఫలమైన సన్‌రైజర్స్‌.. అదే ఆటతీరును రెండో హాఫ్‌లోనూ కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్స్ అందరూ విఫలమయ్యారు. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సన్​రైజర్స్​కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ ​(0) అన్రిచ్ నోర్జే బౌలింగ్​లో అక్షర్ పటేల్​ చేతికి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. కాగిసో రబాడ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతిని సిక్స్‌గా మలిచిన మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (18).. అదే ఓవర్లో చివరి బంతికి శిఖర్ ధావన్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.పవర్‌ ప్లే ముగిసే సరికి ఆరెంజ్ ఆర్మీ 32/2 స్కోరుతో నిలిచింది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) కూడా ఆకట్టుకోలేకపోయాడు. స్వల్ప వ్యవధిలో రెండు జీవనాధారాలు లభించినా.. భారీ ఇన్నింగ్స్‌ ఆడటంలో విఫలమయ్యాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 10వ ఓవర్ ఇదో బంతికి ఔట్ అయ్యాడు. ఆడుకుంటారనుకున్న మనీశ్‌ పాండే (17), కేదార్‌ జాదవ్‌ (3), జాసన్‌ హోల్డర్‌ (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ముఖ్యంగా పాండే, జాదవ్‌ మొదటి ఎడిషన్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగించారు. ఇన్నింగ్స్ చివరలో అబ్దుల్‌ సమద్‌ (28), రషీద్‌ ఖాన్ (22) రాణించడంతో హైదరాబాద్‌ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. సందీప్​ శర్మ (0), భువనేశ్వర్​ కుమార్ ​(5 నాటౌట్) పరుగులు చేశారు. బౌలర్ రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, September 22, 2021, 21:59 [IST]
Other articles published on Sep 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+