DC Squad 2022: శార్దూల్ ఠాకూర్‌పై కనక వర్షం.. తక్కువ ధరకే వార్నర్! ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు ఇద

బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో అదృష్టం అంటే ఢిల్లీ క్యాపిట్స్‌దే. వేలంలో భారీ ధర పలకడం ఖాయమనుకున్న ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తక్కువ ధరకే దక్కించుకుంది. ఇక ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు ముందుగా అనుకున్నట్లుగానే భారీ ధర వెచ్చించాల్సి వచ్చింది. వీరితోపాటు ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్, కేఎల్ భరత్, యష్ ధూల్ వంటి పేరున్న ఆటగాళ్లను ఢిల్లీ కొనుగోలు చేసింది.

ఎంత మంది అంటే..
మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైన్ చేసుకున్న నలుగురు ఆటగాళ్లను కలుపుకుంటే ఆ జట్టులోని సభ్యుల సంఖ్య మొత్తం 24కు చేరింది. మొత్తం వేలం ముగిశాక ఢిల్లీ వద్ద కేవలం 10 లక్షల రూపాయలే మిగిలి ఉన్నాయి. ఇక గత సీజన్లో మాదిరిగా ఆ జట్టును ఈ సారి కూడా రిషబ్ పంతే నడిపించనున్నాడు. ఢిల్లీ జట్టులో మొత్తం ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 17 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఢిల్లీ బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నప్పటికీ, బౌలింగ్‌లోనే కాస్త బలహీనంగా కనిపిస్తుంది.

కొనుగోలు చేసిన స్టార్ ఆటగాళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలంలో అత్యధికంగా టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక భారీ ధర పలకడం ఖాయమనుకున్న డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకే దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్షన్ రూ. 6.50 కోట్లకు కొనుగోలు చేసింది. సయ్యద్ ఖలీల్ అహ్మద్‌ను రూ. 5.25 కోట్లకు, చేతన్ సకారియాను రూ. 4.20 కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.47.5 కోట్లను ఖర్చు చేసింది.

బ్యాటర్లు, బౌలర్లు వీళ్లే
ఢిల్లీలో బ్యాటర్లుగా రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్, యశ్ ధుల్, హెబ్బర్, సర్‌ఫ్రాజ్ ఖాన్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, పొవెల్, పృథ్వీ షా, సీఫర్ట్ ఉన్నారు. ఇక బౌలర్లుగా ముస్తాఫిజుర్, రవిచంద్రన్ అశ్విన్, ఎన్‌గిడి, కుల్దీప్ యాదవ్, ఖలీల్, చేతన్ సకారియాను ఢిల్లీ దక్కించుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, నాగర్‌కోటి, అక్షర్ పటేల్, నోకియా, లలిత్ యాదవ్, రిపల్ పటేల్, ప్రవీణ్ దూబెను కొనుగోలు చేసింది.

ఢిల్లీ పూర్తి జట్టు ఇదిగో
రిషభ్ పంత్ (16 కోట్లు), ఆన్రిచ్ నోర్జే(6.50 కోట్లు), అక్షర్ పటేల్(9 కోట్లు), పృథ్వీషా(7.50 కోట్లు), మిచెల్ మార్ష్ (6.50 కోట్లు), సయ్యద్ ఖలీల్ అహ్మద్(5.25 కోట్లు), చేతన్ సకారియా(4.20 కోట్లు), రోవ్‌మన్ పావెల్ ( 2.80 కోట్లు), ముస్తాఫిజర్ రెహ్మాన్(2 కోట్లు), కుల్‌దీప్ యాదవ్(2 కోట్లు), కేఎస్ భరత్ (2 కోట్లు), కమ్‌లేష్ నగర్‌కోటి(1.10 కోట్లు), మన్‌దీప్ సింగ్(1.10 కోట్లు), లలిత్ యాదవ్( 65 లక్షలు), టిమ్ సీఫెర్ట్(రూ. 50 లక్షలు), యాష్ ధుల్(50 లక్షలు), ప్రదీప్ దూబే(50 లక్షలు), ఎంగిడి(50 లక్షలు), అశ్విన్ హెబ్బర్, సర్ఫరాజ్ ఖాన్, రిపల్ పటేల్, విక్కీ ఓత్సవాల్( వీరందరికీ 20 లక్షలు).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications