Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC Probable Squad For IPL 2022: ఢిల్లీలోకి య‌ష్ ధూల్, కాన్వే, ష‌మీ, ర‌వి కుమార్‌.. పూర్తి జ‌ట్టు ఇదే

DC Probable Squad For IPL 2022: List of players to be bought by Delhi Capitals in Mega Auction

ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఫ్రాంచైజీల‌న్నీ త‌మ తుది జ‌ట్ల‌పై ఓ అంచ‌నాకు వ‌స్తున్నాయి. ఆ అంచనా ఆధారంగానే వేలంలో జ‌ట్ల‌ను కొనుగోలు చేయాల‌ని భావిస్తున్నాయి. అందుకోసం స‌రైన వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సారైన ట్రోఫీ గెలిచి.. ఒక్క సారి కూడా టైటిల్ గెల‌వ‌లేద‌నే లోటును తీర్చుకోవాల‌ని చూస్తున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ తుది జ‌ట్టుపై ఓ అంచ‌నాకు వ‌చ్చింది. ఆ అంచ‌నా ఆధారంగా వేలంలో ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తే ఈ సారి ట్రోఫీ ఇక త‌మ‌దే అని ఢిల్లీ యాజ‌మాన్యం బ‌లంగా న‌మ్ముతుంది.

రిటెన్ష‌న్ జాబితా

రిటెన్ష‌న్ జాబితా

గ‌తేడాది ఉన్న ఆట‌గాళ్ల‌లో ఈ సారి ఢిల్లీ క్యాపిట‌ల్స్ న‌లుగురిని త‌మ రిటెన్ష‌న్ జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో కెప్టెన్ రిష‌బ్ పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్, పృథ్వీ షా, నోర్జేకు చోటు ద‌క్కింది. ఇందుకుగాను ఢిల్లీ యాజ‌మాన్యం పంత్‌కు రూ.16 కోట్లు, అక్ష‌ర్‌ప‌టేల్ రూ.9 కోట్లు, పృథ్వీషాకు రూ.7.50 కోట్లు, నోర్జేకు రూ.6.50 కోట్లు చెల్లించ‌డానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రూ.90 కోట్ల‌కు గాను ఢిల్లీ ద‌గ్గ‌ర ఇంకా రూ.51 కోట్ల రూపాయ‌లు వేలానికి మిగిలి ఉన్నాయి.

ఓపెన‌ర్లు ధావ‌న్, పృథ్వీ షా

ఓపెన‌ర్లు ధావ‌న్, పృథ్వీ షా

ఓపెన‌ర్లుగా గ‌త సీజ‌న్‌లో ఉన్న శిఖ‌ర్ ధావ‌న్, పృథ్వీషానే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ సారి కూడా కొన‌సాగించే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇప్ప‌టికే షాను రిటైన్ చేసుకోగా.. ధావ‌న్‌ను మాత్రం ఢిల్లీ వేలంలోకి వ‌దిలేసింది. అయితే ధావ‌న్‌ను వేలంలో త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో ఢిల్లీ ఉంద‌ట‌. ఎందుకంటే ఢిల్లీ త‌ర‌ఫున ధావ‌న్ నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి జ‌ట్టు విజయాల్లో కీల‌క పాత్ర పోషించాడు. ధావ‌న్‌, షాకు తోడుగా ప్ర‌స్తుతం ఇండియా అండ‌ర్ 19 జ‌ట్టు ఓపెన‌ర్‌గా రాణిస్తున్న‌ అంగ్క్రిష్ రఘువంశీని వేలంలో కొనుగోలు చేయానున్నార‌ని స‌మాచారం.

 ఇండియా అండ‌ర్ 19 జ‌ట్టుపై క‌న్ను

ఇండియా అండ‌ర్ 19 జ‌ట్టుపై క‌న్ను

ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం ఈ సారి వేలంలో టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌పై క‌న్నేసింద‌ని స‌మాచారం. వీలైనంత మంది ఆట‌గాళ్ల‌ను ఇండియా అండ‌ర్ 19 జ‌ట్టు నుంచి కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం భార‌త‌ అండ‌ర్ 19 జ‌ట్టు కెప్టెన్ అయినా య‌ష్ ధూల్‌ను ఎంత ధ‌ర వెచ్చించైనా వేలంలో కొనుగోలు చేయాల‌ని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంద‌ని స‌మాచారం. గ‌తంలో కూడా వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన ఇండియా అండ‌ర్ 19 జ‌ట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ను ఢిల్లీ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే అండ‌ర్ 19 టీమిండియా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తోన్న స్పిన్న‌ర్ విక్కీ ఓస్త్వాల్, పేస‌ర్‌ రవి కుమార్‌ను వేలంలో ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని ఢిల్లీ నిర్ణ‌యించుకుంద‌ట‌.

ర‌బాడ‌, హెట్ మేయ‌ర్ రీఎంట్రీ

ర‌బాడ‌, హెట్ మేయ‌ర్ రీఎంట్రీ

అలాగే గత సీజ‌న్లో ఢిల్లీ త‌ర‌ఫున నిల‌క‌డగా రాణించిన సౌతాఫ్రికా పేస‌ర్ క‌గిసో ర‌బాడ‌తో పాటు వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ హెట్‌మేయ‌ర్‌ను కూడా వేలంలో తిరిగి ద‌క్కించుకోనున్నార‌ట‌. గ‌తంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన మ‌రికొంత‌మందిని కూడా మ‌ళ్లీ వేలంలో తిరిగి ద‌క్కించుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. వీరితోపాటు టీమిండియాలో ఇటీవ‌ల చోటు సంపాదించుకున్న ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, ఆవేశ్ ఖాన్‌ను కూడా వేలంలో ద‌క్కించుకోవ‌డానికి ఢిల్లీ వ్యూహాలు సిద్దం చేసింద‌ట‌.

కాన్వే, ష‌మీ, చాహ‌ర్‌ను కొనుగోలు

కాన్వే, ష‌మీ, చాహ‌ర్‌ను కొనుగోలు

న్యూజిలాండ్ క్రికెట‌ర్ డేవాన్ కాన్వే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. అన్ని ఫార్మాట్ల‌లో కివీస్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తాడు. దీంతో ఈ సారి వేలంలో కాన్వే కోసం తీవ్ర పోటీ నెల‌కొన‌డం ఖాయ‌మనే చెప్పుకోవాలి. అయితే కాన్వేను ఎలాగైన స‌రే, ఎంత ధ‌ర అయినా వెచ్చించి కొనుగోలు చేయాల‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ డిసైడ్ అయింద‌ని స‌మాచారం. అలాగే టీమిండియా సీనియ‌ర్ పేస‌ర్ మహ్మ‌ద్ ష‌మీతోపాటు గ‌తంలో ముంబై ఇండియ‌న్స్‌లో కీల‌క స్పిన్న‌ర్‌గా ఉన్న రాహుల్ చాహ‌ర్‌ను కూడా వేలంలో ఎలాగైనా కొనుగోలు చేయాల‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ భావిస్తోంద‌ని స‌మాచారం.

 ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీం(అంచ‌నా)

ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీం(అంచ‌నా)

పృథ్వీ షా, శిఖ‌ర్ ధావ‌న్‌, అంగ్క్రిష్ రఘువంశీ, రిష‌బ్ పంత్ ( కెప్టెన్‌& వికెట్ కీప‌ర్‌), హెట్‌మేమ‌ర్, స్టీవెన్ స్మిత్, య‌ష్ ధూల్, డేవాన్ కాన్వే, దీప‌క్ చాహ‌ర్‌, ర‌బాడ‌, ష‌మీ, రాహుల్ చాహ‌ర్, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, ఆవేష్ ఖాన్‌, సామ్ బిల్లింగ్స్‌, అక్ష‌ర్‌ప‌టేల్, నోర్జే, అమిత్ మిశ్రా.

Story first published: Saturday, February 5, 2022, 17:19 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+