For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ విజయం వారికి అంకితం: అక్షర్ పటేల్

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌పై చారిత్రక విజయం సాధించిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని మాటలను పంచకున్నాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. గత మ్యాచ్ ఓటమి తర్వాత కూడా తాము సానుకూల దృక్పథంతోనే ఉన్నామని, ప్రతిరోజూ మైదానంలోకి వచ్చి మన పనిని మనం సరిగ్గా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్మామని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, తాము వేసుకున్న ప్రణాళికలు నూటికి నూరు శాతం అమలయ్యాయని అక్షర్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి జట్టులోని కీలక బ్యాటర్ల వికెట్లు తీయడం మ్యాచ్ మలుపు తిప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్టార్క్ ఈజ్ బ్యాక్.. అందుకే అతనొక లెజెండ్!
చాలా కాలం తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రదర్శనపై అక్షర్ ప్రశంసల వర్షం కురిపించాడు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత వచ్చి, ఇలాంటి పిచ్‌పై అద్భుతమైన ప్రదర్శన చేయడం స్టార్క్ గొప్పతనానికి నిదర్శనమని కొనియాడాడు. అందుకే ఆయనను క్రికెట్ లెజెండ్ అంటారని, స్టార్క్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద సానుకూలాంశమని అక్షర్ పేర్కొన్నాడు. స్టార్క్ తన అనుభవంతో ఢిల్లీ బౌలింగ్ విభాగానికి కొత్త బలాన్ని ఇచ్చారని అక్షర్ పటేల్ వివరించాడు.

DC Captain Axar Patel Dedicates Historic Win Over RR to Deceased Fans Praises Mitchell Starc

అతిగా ఆలోచించను.. మనసు చెప్పిందే చేస్తా!
తన కెప్టెన్సీ అనుభవాల గురించి ప్రస్తావిస్తూ.. భారత జట్టులో ఉన్నప్పుడు లీడర్‌షిప్ రోల్స్‌లో పని చేయడం తనకు ఇక్కడ బాగా ఉపయోగపడుతోందని అక్షర్ తెలిపారు. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లను, భారతీయ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని, ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా ఎంతో మెరుగయ్యానని చెప్పాడు. ఇప్పుడు తాను అతిగా ఆలోచించడం లేదని, తన అంతరాత్మ చెప్పే మాటను నమ్మి ముందుకు వెళ్తున్నానని.. కోచ్‌లు,సపోర్ట్ స్టాఫ్ అందించే సహకారం వల్ల జట్టు సరైన దిశలో పయనిస్తోందని ధీమా వ్యక్తం చేశాడు.

చివరగా, అక్షర్ పటేల్ ఒక భావోద్వేగపూరితమైన విషయాన్ని పంచుకున్నాడు. గత మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబానికి చెందిన ఇద్దరు అభిమానులు ఓ విషాదకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయారని, ఈ విజయాన్ని ఆ ఇద్దరు సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ గెలుపు వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అలాగే తన చేతికి తగిలిన గాయంపై స్పందిస్తూ.. ప్రస్తుతం అంతా బాగుందని, ఫిజియో ఐస్ ప్యాక్ పెట్టారని, ఆందోళన చెందాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చాడు.

Story first published: Saturday, May 2, 2026, 6:00 [IST]
Other articles published on May 2, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+