న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంబటి రాయుడు ఈజ్ బ్యాక్: హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక

 Days after retirement U-turn, Ambati Rayudu named captain of Hyderabad

హైదరాబాద్: విజయ్ హాజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా అంబటి రాయుడిని నియమిస్తూ హెచ్‌సీఏ ప్రకటించింది. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు గత జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అంబటి రాయుడు వెనక్కి తీసుకున్నాడు. 'నా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. ఇక అన్ని ఫార్మాట్లో క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నా. మళ్లీ క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇవ్వండి' అని హెచ్‌సీఏకు లేఖ రాయడంతో అందుకు ఆమోదం లభించింది.

ధోనికి ఎంతో ప్రత్యేకం: '12YearsOfCaptainDhoni' ట్విట్టర్‌లో ట్రెండింగ్ధోనికి ఎంతో ప్రత్యేకం: '12YearsOfCaptainDhoni' ట్విట్టర్‌లో ట్రెండింగ్

ఈ నేపథ్యంలో విజయ్ హాజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా అంబటి రాయుడిని నియమించారు. రాయుడిని హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా నియమించిన తర్వాత నోయల్‌ డేవిడ్‌ స్పందించారు. "రాయుడిలో ఇంకా ఐదేళ్ల క్రికెట్‌ మిగిలే ఉంది. దురదృష్టవశాత్తూ వరల్డ్‌కప్‌లో ఆడలేకపోయాడు. దీంతో నిరాశ చెందాడు" అని తెలిపారు.

"అయితే.. నేను, లక్ష్మణ్‌లు రాయుడితో మాట్లాడి అతడిని ఓడార్చడం జరిగంది. దీంతో అతని రిటైర్మెంట్‌ విషయంలో వెనక్కి తగ్గాడు. రాయుడి అనుభవం యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌కు కూడా రాయుడి సేవలు అవసరం" అని నోయల్‌ డేవిడ్‌ తెలిపారు.

'ఓపెనర్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయితే భారత్‌కు తిరుగుండదు''ఓపెనర్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయితే భారత్‌కు తిరుగుండదు'

విజయ్‌ హజారే ట్రోఫీకి హైదరాబాద్‌ జట్టు:
అంబటి రాయుడు(కెప్టెన్‌), బి సందీప్‌(వైస్‌ కెప్టెన్‌), అక్షత్‌ రెడ్డి, తన్మయ్‌ అగర్వాల్‌, థాకూర్‌ వర్మ, రోహిత్‌ రాయుడు, సీవీ మిలింద్‌, మెహిద్‌ హసన్‌, సాకేత్‌ సాయి రామ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మిక్కిల్‌ జైశ్వాల్‌, మల్లికార్జున్‌(వికెట్‌ కీపర్‌), కార్తీకేయ కాక్‌, టి రవితేజ, అయా దేవ్‌ గౌడ్‌

Story first published: Saturday, September 14, 2019, 16:39 [IST]
Other articles published on Sep 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X