అతిపెద్ద సవాల్ అదే: భారత్‌లో తొలి డే/నైట్ టెస్టుపై సచిన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్లడ్‌లైట్ల కింద భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు ఆడటాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు. ఇదొక మంచి ఎత్తుగడ అని చెప్పిన సచిన్... సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను బ్రతికించుకోవడానికి ఇదొక మంచి మార్గమని సచిన్ తెలిపాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 22న బంగ్లాదేశ్‌తో భారత్ తొలి పింక్ బాల్ టెస్టు ఆడనుంది.
ఈ నేపథ్యంలో తాజాగా సచిన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో "మంచు ఒక కారకంగా మారనంత వరకు ఇది మంచి చర్య. కానీ, మంచు ఒక కారకంగా మారబోతుంటే మాత్రం సీమర్లు, స్పిన్నర్లకు ఇది అతిపెద్ద సవాల్. ఎందుకంటే బంతి తడిసిన తర్వాత, సీమర్లు లేదా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేరు" అని అన్నాడు.

ఫ్లడ్ లైట్ల కింద వన్డేలు
గతంలో ఈడెన్ గార్డెన్స్‌లో ఫ్లడ్ లైట్ల కింద వన్డేలు ఆడిన సందర్భంలో కూడా మంచు ఒక కారకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. "మంచు ప్రభావం ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంత మంచు ఉందో మనం గుర్తించాలి. రెండు జట్లు ఎంతవరకు పోటీ పడుతున్నాయో మంచు నిర్ణయిస్తుంది. పరిస్థితులు దేనికీ ఆటంకం కలిగించకూడదు (పోటీతత్వం)" అని సచిన్ అన్నాడు.

జనాన్ని తిరిగి స్టేడియానికి
జనాన్ని తిరిగి స్టేడియానికి తీసుకురావడానికి ఈ ప్రయోగం మంచి ఆలోచన అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. "డే/నైట్ టెస్టును రెండు కోణాల్లో చూడాలి. ఒకటి ప్రజల కోణం. ఒకటి ప్రజలు తమ పని గంటల తర్వాత డే/నైట్ టెస్ట్ చూడగలుగుతారు కాబట్టి ఇది మంచి కాన్సెప్ట్. ప్రజలు సాయంత్రం వచ్చి ఆట ఆనందించవచ్చు" అని సచిన్ పేర్కొన్నాడు.

సాంప్రదాయ ఎర్ర బంతితో పోలిస్తే
"రెండోది ఆటగాళ్ల కోణంలో చూస్తే... సాంప్రదాయ ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బంతితో ఆడటం చెడ్డ ఆలోచన కానేకాదు. ఇక్కడ బంతి రంగు మారుతుందంతే. బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో వేర్వేరు బంతులతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కొత్త పింక్ బాల్, 20 ఓవర్ పింక్ బాల్, 50 ఓవర్ పింక్ బాల్, 80 ఓవర్ బంతి ఇలా" అని సచిన్ అన్నాడు.

ఎంత భిన్నంగా ప్రవర్తిస్తుందో చూడండి
"ఈ క్రమంలో కొత్త, సెమీ న్యూ మరియు పాత బంతి ఎంత భిన్నంగా ప్రవర్తిస్తుందో చూడండి. దీని ప్రకారం మీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి" అని సచిన్ తెలిపాడు. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతులతో తొలి డే/నైట్ టెస్టు జరిగింది. ఆ తర్వాత భారత్‌లో ప్రయోగాత్మకంగా దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించారు.

దులిప్ ట్రోఫీని గులాబి బంతులతో
ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు దులిప్ ట్రోఫీని గులాబి బంతులతో నిర్వహించినప్పటికీ.... పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో ఈ ఏడాది ఎర్రబంతితోనే నిర్వహించడం విశేషం. దీంతో దులిఫ్ ట్రోఫీలో గులాబి బంతితో ఆడిన ఆటగాళ్ల అనుభవాలను భారత జట్టులోని ఆటగాళ్లు తెలుసుకోవాలని సచిన్ సూచించాడు.

వారి అనుభవాలను తెలుసుకోవాలి
"దులీప్ ట్రోఫీని ఆడిన వారందరి నుండి టీమిండియా ఆటగాళ్లు నోటి మాట ద్వారా వారి అనుభవాలను తెలుసుకోవాలి. వారి వద్ద పంచుకోవడానికి కొన్ని విషయాలు ఉంటాయి" అని సచిన్ అన్నాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ 1991-92లో తన మొదటి ఆస్ట్రేలియా పర్యటనను గుర్తుచేసుకున్నాడు.

అది నాకు కొత్త విషయం
భారతదేశం, ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ పాల్గొన్న ఈ సిరిస్‌లో ఐదు టెస్టులను ముక్కోణపు సిరిస్ మాదిరి నిర్వహించారు. "నేను ఎర్ర బంతితో ప్రారంభించి, ఆపై తెల్ల బంతికి మారి, మళ్ళీ ఎర్ర బంతికి రావడం నాకు గుర్తుంది. నేను వైట్ బాల్ ఎక్కువగా ఆడలేదు కాబట్టి ఇప్పుడు అది నాకు కొత్త విషయం" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

ఆ అనుభూతి వింతగా!
బ్యాటింగ్‌లో గులాబి బంతిని ఎదుర్కొనే అనుభూతి వింతగా ఉంటుందని సచిన్ అన్నాడు. "ఇది సీమర్‌లకు మరింత సహాయపడుతుంది. కానీ మీరు నాణ్యమైన స్పిన్నర్‌ను తీసుకువస్తే, అతడు ఆ ఉపరితలంపై కూడా బౌలింగ్ చేసే మార్గాన్ని కనుగొంటాడు. ఒక స్పిన్నర్ కోసం, ఉపరితలంపై ఎంత బౌన్స్ ఉందో, బంతి ఎంత స్కిడ్ అవుతుందో అంచనా వేయడం చాలా ముఖ్యం" అని సచిన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications