న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ.10.75 కోట్లు ఇచ్చిన ఉత్సాహం: 39 బంతుల్లో 83 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్

Day after million-dollar IPL bid, Maxwell smashes 83 off just 39 in BBL

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసింది. వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. ఇంకేముంది తాను ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడంతో ప్రస్తుతం ఆస్టేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌‌ రెచ్చిపోయాడు.

ట్విట్టర్‌లో ఫోటోలు: మూడో వన్డేకి ముందు చిల్ మూడ్‌లో కోహ్లీట్విట్టర్‌లో ఫోటోలు: మూడో వన్డేకి ముందు చిల్ మూడ్‌లో కోహ్లీ

మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మాక్స్‌వెల్‌‌

మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మాక్స్‌వెల్‌‌

ఈ లీగ్‌లో మాక్స్‌వెల్‌‌ మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా బ్రిస్బేన్‌ హీట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌‌ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 39 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింతగా చెలరేగి ఆడిన మాక్స్‌వెల్‌ మొత్తం 7 బౌండరీలు, 5 సిక్సర్లు బాదాడు.

7 వికెట్ల నష్టానికి 167 పరుగులు

7 వికెట్ల నష్టానికి 167 పరుగులు

దీంతో ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మాక్స్‌వెల్‌ సూపర్ ఫామ్‌పై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా "బిగ్‌ షో నుంచి బిగ్‌ షో. మాక్స్‌వెల్‌ విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. 39 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టును ముందుకు నడిపించాడు" అని పంజాబ్‌ ట్వీట్‌ చేసింది.

2014 నుంచి 2017 వరకు

2014 నుంచి 2017 వరకు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2014 నుంచి 2017 వరకు మాక్స్‌వెల్‌‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2018 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల 2019లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు.

క్రికెట్‌కు విరామం

క్రికెట్‌కు విరామం

ఈ ఏడాది అక్టోబర్‌లో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సమయంలోనే మానసిక ఆరోగ్య సమస్యలతో మూడు నెలలు క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. కాగా, ఆస్ట్రేలియా తరఫున 61 టీ20లు ఆడిన మ్యాక్స్‌వెల్ 35.02 సగటుతో 1,576 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 145.

Story first published: Saturday, December 21, 2019, 7:56 [IST]
Other articles published on Dec 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X