లార్డ్స్‌లో నెరవేరని సచిన్ టెండూల్కర్ కల

భారత్ తీవ్రమైన కష్టాల్లో పడింది. ఓటమిని తప్పించుకోవడానికి యాతన పడుతున్న సమయంలో సచిన్ టెండూల్కర్ అవుట్ కావడం తీవ్ర నిరాశను కలిగించింది. అతను అండర్సన్ బౌలింగులో అవుటయ్యాడు. మరో రెండు, మూడు గంటల ఆట మిగిలి ఉన్న సమయంలో ఐదో రోజు సచిన్ టెండూల్కర్ అవుట్ కావడంతో భారత్ 165 పరగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.
బ్యాటింగులోనే కాకుండా బౌలింగులోనూ ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండు భారత్ రెండో ఇన్నింగ్సులో లంచ్ సమయానికి 142 పరగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండు తమ ముందు ఉంచిన 458 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వివియస్ లక్ష్మణ్, గౌతం గంభీర్ వెంట వెంటనే అవుటయ్యారు. వివియస్ లక్ష్మణ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. లక్ష్మణ్ 113 బంతులు ఆడి 56 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. సురేష్ రైనా, ధోనీ ఈ వార్త రాసేటప్పటికీ క్రీజులో ఉన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications