For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరీస్ క్లీన్‌స్వీప్: కోట్లాలో చరిత్ర సృష్టించిన కోహ్లీ

By Nageswara Rao

న్యూఢిల్లీ: ప్రీడమ్ సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 337 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

మ్యాచ్‌ని ఎలాగైనా డ్రాగా ముగించాలని చూసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు, భారత బౌలర్ల దెబ్బకు విలవిలలాడారు. నాల్గవ టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. నాల్గవ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 143 పరుగులే ఆలౌట్ అయింది.

Day 5 Kotla Test: AB de Villiers Continues to Defy Hosts, Ravindra Jadeja Builds Pressure

మరో 18.5 ఓవర్ల పాటు ఆడివుంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది. కానీ టాప్ ఆర్డర్ విఫలమవడంతో తరువాత ఆ జట్టు నిలదొక్కుకోలేకపోయింది. చివరకు ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ 5, యాదవ్ 3, జడేజా 2 వికెట్లు తీసుకున్నారు.

4వ టెస్ట్ సాగిన తీరిది:

తొలి ఇన్నింగ్స్

భారత్ : 334 ఆలౌట్
దక్షిణాఫ్రికా : 121 ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం 213

రెండో ఇన్నింగ్స్

భారత్ : 267 ఆలౌట్
దక్షిణాఫ్రికా : 143 ఆలౌట్

మ్యాచ్ సమ్మరీ:

జట్టు స్కోరు 136 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ (43) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అంతక ముందు టీ విరామ సమయానికి దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. జట్టు స్కోరు 125 వద్ద డుమిని డకౌట్ రూపంలో పరుగులేమీ చేయకుండానే అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఐదు వికెట్లను కోల్పోయి 112 పరుగులు సాధించింది. క్రీజులో డివిలియర్స్‌ 264 బంతుల్లో 34 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లంచ్‌ విరామ సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. కోహ్లీ స్పిన్నర్లు, పేసర్లతో బౌలింగ్‌ చేయిస్తూ సఫారీలపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తొలి సెషన్‌లో 35 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు సాధించింది. 481 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 72/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆమ్లా రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 244 బంతులాడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఆమ్లా 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌‌కు చేరాడు.

జట్టు స్కోరు 76 పరుగులున్నప్పుడు ఆమ్లాను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్‌ (13), డుప్లెసిస్‌ ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 405 పరుగుల దూరంలో ఉంది. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

నాల్గవ రోజు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 267 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం 213 పరుగులను కలుపుకుని దక్షిణాఫ్రికా ముందు 481 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రహానె సెంచరీ అనంతరం భారత్‌ టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 206 బంతులాడిన రహానే 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 100 పరుగులు సాధించాడు. రహానేకు ఇది ఆరో శతకం. తొలి ఇన్నింగ్స్‌లో కూడా రహానె సెంచరీ సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+