For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే-3: 498పరుగుల ఆధిక్యంలో భారత్.. స్కోర్ 189/3

భారత స్పిన్నర్‌లు విజృంభించడంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ విలవిలలాడిపోతున్నారు. మూడో రోజు ఆటలో తొలి రెండు వికెట్లను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పడగొట్టాడు.

గాలే:భారత్-శ్రీలంక మూడో రోజు టెస్టులో వరుణుడి వల్ల తాత్కాళికంగా ఆట నిలిచిపోయింది. తిరిగి ప్రారంభమైన తర్వాత క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ అభినవ్ ముకుంద్, కోహ్లి, ఇద్దరూ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

భారత రెండో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో పుజారా (15) ఔటైన తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమయ్యాక.. కోహ్లి, ముకుంద్ నిలకడగా ఆడుతూ వచ్చారు.

ఈ క్రమంలో 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గుణతిలక బౌలింగ్‌లో ముకుంద్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లి(76) పరుగులతో క్రీజులో ఉండగా.. భారత్ 498పరుగుల ఆధిక్యంలో ఉంది.

Day 3: Hosts 289/8 at Lunch; Parera unbeaten at 90*

అంతకుముందు:

భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 291 పరుగులకు ఆలౌట్‌ చేసి భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన 17వ ఓవర్‌ మధ్యలో ఒక్కసారిగా వర్షం వచ్చింది.

17వ ఓవర్లో లహిరూ కుమారా బౌలింగ్‌లో పుజారా ఔటైన వెంటనే చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో అంపైర్లు మ్యాచ్‌ నిలిపివేసి ఆటగాళ్లను డ్రెస్సింగ్‌ రూమ్‌కు పంపించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 16.5 ఓవర్లకు భారత్‌ రెండు వికెట్లు(ధావన్ 14, పూజారా 15) కోల్పోయి 56 పరుగులు చేసింది. అభినవ్‌ ముకుంద్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్‌ ప్రస్తుతం 365 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

స్పిన్నర్లు తిప్పేశారు

భారత స్పిన్నర్‌లు విజృంభించడంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ విలవిలలాడారు. మూడో రోజు ఆటలో మొత్తం మూడు వికెట్లను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పడగొట్టాడు. దీంతో 291 పరుగులు చేసిన శ్రీలంక అలౌటైంది.

కట్టుదిట్టమైన బౌలింగ్‌, అద్భుత ఫీల్డింగ్‌తో ఆతిథ్య లంకను కట్టడి చేసింది టీమిండియా. రెండో రోజు విజృంభించిన పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీలు శుక్రవారం మ్యాచ్‌లో ఆతిథ్య ఆటగాళ్లను ఇబ్బంది పెట్టలేకపోయారు.

అయితే, స్పిన్నర్లు మాత్రం లంక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా కట్టి చేస్తున్నారు. లంచ్ విరామానికి శ్రీలంక జట్టు 8 వికెట్లు కోల్పోయి 289పరుగులు చేసింది. ప్రస్తుతం పెరీరా 90, కుమారా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, భారత బౌలర్లలో షమీ 2, జడేజా3, యాదవ్, అశ్విన్, పాండ్యా తలో వికెట్ తీశారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+