For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే 2, ఆసీస్ 469/7వద్ద డిక్లేర్‌: తడబడుతోన్న భారత్ ఏ

ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్ నైట్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్‌లు తొలి సెషన్ లోపే అర్ధ సెంచరీలు సాధించారు.

By Nageshwara Rao

ప్రాక్టీస్ మ్యాచ్‌లో తడబడుతోన్న టీమిండియా ఏ
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియా ఏ తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసిన అనంతరం ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఇండియా ఏ జట్టు స్కోరు 19పరుగుల వద్ద ఓపెనర్‌ హెర్వాద్కర్‌ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్‌ పంచాల్‌ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవలియన్‌కు చేరాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా ఏ జట్టు రెండు వికెట్లను కోల్పోయి 68పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఎస్‌ఎస్‌ అయ్యర్‌ 20, ఏఆర్‌ బానే 4 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్‌ లియోన్‌ రెండు వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469/7వద్ద డిక్లేర్‌
327/5పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌ను 469/7వద్ద డిక్లేర్‌ చేసింది. ఇండియా ఏతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఆస్ట్రేలియా తన జోరుని కొనసాగిస్తోంది. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్ నైట్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్‌లు తొలి సెషన్ లోపే అర్ధ సెంచరీలు సాధించారు.

దీంతో ఆస్ట్రేలియా ఆసీస్ 114.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. 325/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి వికెట్‌ను కోల్పోయి 436 పరుగులు చేసింది. 135 బంతులను ఎదుర్కొన్న మార్ష్ 64 పరుగులు చేశాడు.

Day 2: Australia reach 436/6 at lunch after M Marsh, Wade 50s

ఆదివారం దూకుడుగా ఆడిన మాథ్యూ వేడ్ 64 పరుగుల వద్ద స్పిన్నర్ అఖిల్ హెర్వడ్కర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆరో వికెట్‌కు మార్ష్-వేడ్‌ల జోడీ 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుక్రవారం తొలి రోజు ఆటలో మూడొందల మార్కును చేరిన ఆస్ట్రేలియా, రెండో రోజు కూడా ఆస్ట్రేలియన్లు సత్తా చాటుతున్నారు.

ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్ (25) ,రెన్ షా (11) పరుగుల వద్ద అవుటై నిరాశ పరిచినా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (107), షాన్ మార్ష్ (104) సెంచ‌రీల‌ు నమోదు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 325 ప‌రుగులు చేసింది. ఇండియా ఎ బౌల‌ర్ల‌లో సైనీ 2, హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+