డేవిస్ కప్: నిరాశపర్చిన పేస్, కివీస్‌పై 4-1తో విజయం
హైదరాబాద్: డేవిస్‌కప్‌లో భారత్ ఒక అడుగు ముందుకేసింది. సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ నిరాశపర్చినా యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, యూకీ భాంబ్రీ మెరిసిన వేళ ఆసియా ఓసియానియా గ్రూప్-1 పోరులో న్యూజిలాండ్‌పై 4-1తో ఘన విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
ఏప్రిల్ 7 నుంచి 9 వరకూ జరిగే రెండో రౌండ్ పోరులో భారత.. ఉజ్బెకిస్థాన్‌తో తలపడనుంది. ఉజ్బెకిస్థాన్ తొలిరౌండ్‌లో దక్షిణ కొరియాపై నెగ్గి రెండో రౌండ్ చేరుకుంది. ఇక్కడి శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన తొలి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో 276వ ర్యాంకర్ రామ్‌కుమార్ 7-5, 6-1, 6-0తో 414వ ర్యాంకర్ ఫిన్ టిర్నేపై అలవోక విజయం సాధించాడు.
రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో మాత్రమే టిర్నే కాస్త పోటీనిచ్చాడు. 22 ఏళ్ల రామ్‌కుమార్ తన బలమైన సర్వీసులతో ఆకట్టుకోగా.. ఫిన్ కళ్లుచెదిరే విన్నర్లు కొట్టాడు. ఒకటికి రెండుసార్లు సర్వీస్ బ్రేక్ అయ్యే ప్రమాదం బయటపడిన రామ్‌కుమార్ పదకొండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి సెట్ గెలిచాడు.
ఆ తర్వాత అనవసర తప్పిదాలు తగ్గించుకున్న రామ్‌కుమర్ నాలుగు, ఆరు గేముల్లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 6-1తో సులభంగా రెండో సెట్ గెలిచాడు. మ్యాచ్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో సెట్లో ఫిన్, రామ్‌కుమార్ ముందు తేలిపోయాడు. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఆడిన రామ్.. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 6-0తో సెట్ పాటు మ్యాచ్‌ను గెలిచాడు.

రామ్‌కుమార్ గెలుపుతోనే భారత తొలిరౌండ్ విజయం
రామ్‌కుమార్ గెలుపుతోనే భారత తొలిరౌండ్ విజయం 3-1తో ఖరారైంది. దీంతో ఆ తర్వాత జరగాల్సిన భాంబ్రీ మ్యాచ్ నామమాత్రమే అయింది. దీంతో బెస్టాఫ్ త్రీ సెట్స్‌గా నిర్వహించిన ఈ ఆఖరి మ్యాచ్‌లో యుకీ భాంబ్రీ 7-5, 3-6, 6-4తో జోస్ స్టాథమ్‌పై విజయం సాధించాడు. తొలిరోజు భాంబ్రీ, రామ్‌కుమార్ సింగిల్స్ మ్యాచ్‌లు గెలవగా, డబుల్స్‌లో లియాండర్ పేస్-విష్ణువర్దన్ జోడీ ఓడిన సంగతి తెలిసిందే.

ఫాస్టెస్ట్ సర్వీసులు, ఏస్‌లతో హడలెత్తించిన రామ్‌కుమార్
రామనాథన్ ఈ మ్యాచ్‌లో తనకన్నా తక్కువ ర్యాంకర్ ఫిన్ టిర్నేని ఫాస్టెస్ట్ సర్వీసులు, ఏస్‌లతో హడలెత్తించాడు. రామ్ 9 డబుల్ ఫాల్ట్స్ చేసినప్పటికీ మొత్తంగా 105 పాయింట్లు, 12 ఏస్‌లతో పైచేయి సాధించాడు. 15 బ్రేక్ చాన్స్‌ల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. ఒకే ఒక ఏస్ సంధించిన టిర్నే 16 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు.

హోరాహోరీగా సాగిన పోరు
ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయలేకపోయాడు. ఉత్కంఠగా మొదలైన తొలి సెట్‌లో టిర్నే గట్టి పోటీ ఇవ్వడంతో పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరూ సర్వీ్‌సలు నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే 6-5తో ఉన్న దశలో 12వ గేమ్‌లో బ్రేక్ సాధించిన రామ్‌కుమార్ తొలిసెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

35 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకున్న రామ్ కుమార్
రెండో సెట్‌లో భారత ఆటగాడు మరింత రెచ్చిపోయాడు. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసి 35 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక మూడో సెట్‌లో పూర్తిగా రామ్‌కుమార్ హవానే సాగింది. రామ్ ఏకంగా మూడు బ్రేక్‌లు సాధించి 6-0తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కూడా ముగించేశాడు.

డబుల్స్‌లో విజయం సాధించడం చాలా కష్టం
మ్యాచ్ అనంతరం భారత జట్టు నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ మాట్లాడుతూ డబుల్స్‌లో విజయం సాధించడం చాలా కష్టం, అందుకే సింగిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించామని అన్నాడు. మూడు మ్యాచ్‌ల్లో గెలవాలన్న లక్ష్యంతో దిగామని, నాలుగు సింగిల్స్‌లో గెలిచామన్నాడు. రామ్‌కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. భవిష్యత్‌లో భారత్‌కు అతడు మరిన్ని విజయాలు అందిస్తాడన్న నమ్మకం ఉందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications