Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: మ్యాచ్ కోసం హెలికాఫ్టర్‌లో వార్నర్ ఎంట్రీ.. వేరే లెవల్! (Video)

టెస్టులకు, వన్డేలకు ఇటీవల గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు. బిగ్ బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్ తరపున ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ కోసం వార్నర్ హెలికాఫ్టర్‌లో సిడ్నీ స్టేడియానికి రావడం విశేషం. దీనికి సంబంధిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

హెలికాఫ్టర్ నుంచి అతడు ఎంట్రీ ఇచ్చే సమయానికి స్టేడియంలో ఎనర్జిటిక్ మ్యూజిక్ ఉండటం విశేషం. కూల్‌గా హెలికాఫ్టర్ దిగిన తర్వాత వార్నర్ తన అభిమానులకు అభివాదం చేశాడు. మరోవైపు నెట్టింట్లో వార్నర్‌ను ప్రముఖ హీరోలతో నెటిజన్లు పోలుస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్, టాలీవుడ్ హీరోలు నాగార్జున, మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

David Warners entry in a helicopter for the match in Big Bash League

ఐపీఎల్‌లో ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడుతున్న వార్నర్ గతంలో సన్‌రైజర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. 2016లో సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన వార్నర్ తర్వాత మేనేజ్మెంట్‌తో విభేదాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కాగా, టాలీవుడ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వార్నర్ తెలుగు అభిమానులకు దగ్గరైన విషయం తెలిసిందే.

కాగా, ఇవాళ మ్యాచ్‌లో సిడ్నీ థండర్ తరపున వార్నర్ రీఎంట్రీ ఇస్తుండగా మరోవైపు సిడ్నీ సిక్సర్స్ తరపున ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పునరాగమనం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ తొలి బంతికే డకౌటయ్యాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్ వచ్చిన స్మిత్‌ను వార్నర్ సరదా మాటలతో కవ్వించాడు.

సిడ్నీ సిక్సర్స్ జట్టులో ఫిలిప్ (47; 35 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిల్క్ (35; 29 బంతుల్లో), విన్స్ (27; 27 బంతుల్లో) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. సిడ్నీ థండర్ బౌలర్లలో ఆండ్రూ, సంఘా చెరో రెండు వికెట్లు, డానియల్ సామ్స్, టోబీ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, January 12, 2024, 16:54 [IST]
Other articles published on Jan 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+