Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner : ‘పుష్ప’కు బర్త్ డే విషెస్.. కూతురితో కలిసి క్యూట్ వీడియో చేసిన వార్నర్!

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు సినిమాలంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప, అల వైకుంఠపురములో సినిమాలను వార్నర్ బాగా ఫాలో అయ్యాడు. అల వైకుంఠపురములో సినిమాలోని 'బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మా..' పాటకు మైదానంలో కాలు కదిపాడు కూడా. అలాగే క్రికెటర్లలో మొట్టమొదటి సారి పుష్ప స్టైల్ చూపించింది కూడా వార్నరే.

కేవలం వార్నర్ ఒక్కడే కాదు. అతని పిల్లలకు కూడా ఈ ఇష్టం ఉంది. అందుకే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా అతనికి వీడియో ద్వారా విషెస్ పంపాడీ ఆసీస్ స్టార్ క్రికెటర్. ఈ వీడియోలో 'హ్యాపీ బర్త్‌డే టు అల్లు అర్జున్' అని వార్నర్ విషెస్ పంపాడు. ఇక చివర్లో అయితే అతని చిన్నారి కూతురు కూడా.. 'హ్యాపీ బర్త్‌డే టు పుష్ప' అని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ సంతోషిస్తున్నారు.

David Warner wishes Allu Arjun happy birthday

తాము కూడా పుష్ప-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వార్నర్ ఈ వీడియోలో చెప్పాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదని నిరూపించడానికి ఈ వీడియో చాలని అతని అభిమానులు అంటున్నారు. కాగా, ఈ ఐపీఎల్‌లో తాము ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తమ వరుస ఓటములకు వీడ్కోలు పలకాలని ఢిల్లీ అనుకుంటోంది. దీనికి తగ్గట్లే జట్టులో మార్పులు కూడా చేసుకుంది. అయితే పెళ్లి చేసుకోవడానికి ఢిల్లీ కీలక ప్లేయర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోవడం ఆ జట్టుకు ఎదురు దెబ్బ అని చెప్పాలి. బౌలింగ్ కూడా చేయడం ప్రారంభించిన మిచెల్ మార్ష్ కచ్చితంగా ఆ జట్టుకు పెద్ద బలంగా మారేవాడే. అయితే పెళ్లి అయిన వెంటనే అతను తిరిగి వచ్చేస్తాడని తెలుస్తోంది.

Story first published: Saturday, April 8, 2023, 16:08 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+