Candice Warner: మరో వ్యక్తితో డేవిడ్ వార్నర్ భార్య రాసలీలలు! నెట్టింట దుమారం!

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతోంది. గతంలో ఎప్పుడో క్యాండీస్ వార్నర్ ఇతర వ్యక్తితో జరిపిన రాసలీలలు మళ్లీ పతాక శీర్షికకు ఎక్కాయి. క్యాండీస్‌తో శృంగారం జరిపిన ఆ వ్యక్తి తాజాగా ఈ ఘటనకు సంబంధించి తన పుస్తకంలో ప్రస్తావించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇక ఐపీఎల్ ద్వారా డేవిడ్ వార్నర్, అతని సతీమణి భారత అభిమానులకు సుపరిచితం. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు వార్నర్‌ను అన్నలా.. ఆమెను వదినలా భావిస్తారు. అలాంటిది ఆమె గురించి ఇలాంటి వార్తలు విని వారు తట్టుకోలేకపోతున్నారు.

అసలు జరిగిందేందంటే..

అసలు జరిగిందేందంటే..

తాగిన మైకంలో కాండీస్ వార్నర్ ఒక వ్యక్తితో టాయిలెట్‌లో శృంగారం చేస్తూ దొరికి పోయింది. 2007లో క్యాండిస్‌కు తెలిసి తెలియని వయసులో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలో క్రాస్-కోడ్ అనే రియాల్టీ గేమ్ ఉంది. అందులో పాల్గొనే వ్యక్తులు ఏదో ఒక వేషం వేసుకొని ఆడుతూ ఉంటారు. మోడల్ అయిన కాండీస్ వార్నర్ అప్పట్లో క్రాస్-కోడ్ గేమ్‌లో ఒక సూపర్ స్టార్. ఆస్ట్రేలియాలో ఐరన్ ఉమెన్‌గా ఆమె ఎంతో పాపులర్. అదే సమయంలో సన్నీ బిల్ విలియమ్స్ అనే వ్యక్తి కూడా క్రాస్-కోడ్‌లో సూపర్ స్టార్. ఒకసారి వీళ్లిద్దరూ ఒక నైట్ క్లబ్‌కు వెళ్లి పీకలదాక మద్యం సేవించారు. ఆ తర్వాత మత్తులో టాయిలెట్లో దూరి శృంగారంలో మునిగిపోయారు. ఇది ఎవరో వీడియో తీసి రచ్చ రచ్చ చేశారు. దీంతో కాండీస్ సెక్స్ అప్పట్లో ఆస్ట్రేలియా అంతటా మార్మోగిపోయింది.

సాధారణ జీవితం గడుపుతున్నా..

సాధారణ జీవితం గడుపుతున్నా..

ఆ తర్వాత కాండీస్ క్రాస్-కోడ్ గేమ్స్ నుంచి తప్పుకొని మామూలు జీవితం గడిపడం మొదలుపెట్టింది. వార్నర్‌ను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు తల్లి అయి చాలా సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అప్పుడెప్పుడో చేసిన ఆ తప్పును ఇప్పటికీ చాలా మంది ఎత్తి చూపుతూ ఆమె పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 2018లో డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్ ఇరుక్కోవడానికి కూడా ఈ ఘటనే ఓ కారణం. సౌతాఫ్రికాతో జరిగిన ఆ టెస్ట్‌ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారా స్థాయికి చేరింది. వార్నర్‌ సతీమణిని ఉద్దేశించి సౌతాఫ్రికా ఆటగాళ్లు గేలి చేయడంతో వార్నర్ అవమానంగా భావించాడు. సౌతాఫ్రికా అభిమానులు సైతం సన్నీ బిల్ విలియమ్స్ ఫేస్ మాస్క్‌లు ధరించి మ్యాచ్ హాజరై వార్నర్‌ను రెచ్చగొట్టారు.

మరిచిపోనివ్వడం లేదు..

మరిచిపోనివ్వడం లేదు..

ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లో వాళ్ల చేతిలో ఓడిపోవద్దనే వార్నర్ టాంపరింగ్‌కు ప్రయత్నించినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఇక వార్నర్ నిషేధానికి గురైనప్పుడు క్యాండీస్‌పై ఆసీస్ అభిమానులు దుమ్మెత్తిపోసారు. నువ్వొక బ్యాడ్ మదర్, బ్యాడ్ వైఫ్ అంటూ పాత విషయాలను గుర్తు చేసి హర్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఒక రియాల్టీ షోలో పంచుకున్నారు. ఆ విషయాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా.. పదే పదే గుర్తు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

పుస్తకంలో వివరించడంతో..

పుస్తకంలో వివరించడంతో..

ఆ నాడు క్యాండిస్‌తో టాయిలెట్‌లో శృంగారం జరిపిన సన్నీ బిల్ విలియమ్స్'యు కాంట్ స్టాప్ ద సన్ ఫ్రమ్ షైనింగ్' పేరుతో ఓ పుస్తకం రాసాడు. ఆ పుస్తకంలో ఆనాడు కాండీస్ వార్నర్‌తో టాయిలెట్‌లో జరిగిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తూ రాసుకొచ్చాడు. దీంతో మరోసారి కాండీస్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మరోసారి ఆస్ట్రేలియాలో ఆమె పట్ల అసభ్యకరమైన ట్రోలింగ్ మొదలైంది. అయితే ఆమెను వెనుకేసుకొచ్చేవాళ్లు మాత్రం తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పును ఒప్పుకున్నా.. ఇప్పటికీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆ ట్రోలింగ్‌ను తిప్పుకొడుతున్నారు. అయినా సన్నీ ఆ ఘటనను పుస్తకంలో రాయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 12, 2021, 20:07 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X