Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లేడీస్​ స్విమ్ సూట్​లో​ డేవిడ్ వార్నర్.. ఇక క్యాండిస్‌ అయితే (వీడియో)

David Warner, Wife Candice Switch Roles In Hilarious TikTok Video

సిడ్నీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. ఆట‌గాళ్లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్న ప్లేయ‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఇటీవలే టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వరుస పెట్టి వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

టిక్‌టాక్ వీడియోల‌తో హల్చల్:

టిక్‌టాక్ వీడియోల‌తో హల్చల్:

మైదానంలో నిత్యం బౌండ‌రీల‌తో హోరెత్తించే డేవిడ్ వార్న‌ర్‌ ఇప్పుడు టిక్‌టాక్ వీడియోల‌తో అభిమానుల్లో థ్రిల్ పుట్టిస్తున్నాడు. ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదన్నట్లు వార్నర్‌ తనకు నచ్చింది చేసేస్తున్నాడు. ఇటీవ‌లే త‌న కూతురితో క‌లిసి కొన్ని వీడియోలు చేసిన వార్న‌ర్‌.. ఇప్పుడు త‌న భార్య క్యాండిస్‌తో క‌లిసి ఓ వీడియో చేశాడు. అయితే తాజాగా చేసిన వీడియో వార్నర్‌లోని కొత్త కోణాన్ని చూపెట్టింది. ఇక్కడ క్యాండిస్, వార్నర్ తమ తమ రోల్స్‌ను మార్చుకుని మరీ టిక్‌టాక్‌ వీడియో చేయడం నవ్వులు పూయిస్తుంది.

స్విమ్ సూట్​లో​ వార్నర్:

స్విమ్ సూట్​లో​ వార్నర్:

వార్న‌ర్ త‌న కాస్ట్యూమ్‌లో తొలుత ఆసీస్ జ‌ట్టు జెర్సీ వేసుకుని ఉన్నాడు. అత‌ని వెనుక క్యాండిస్‌.. స‌ర్ఫింగ్ కాస్ట్యూమ్‌లో బోటు న‌డుపుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓ లైట్ మ్యూజిక్‌తో వీడియో సాగుతుంది. అయితే అక‌స్మాత్తుగా ఆ వీడియోలో ఇద్ద‌రి ప్లేస్ మారుతుంది. వార్న‌ర్ డ్రెస్సులో క్యాండిస్‌.. భార్య స‌ర్ఫింగ్ కాస్ట్యూమ్‌లోకి డేవిడ్ మారుతాడు. బోటులో షికారుకు వెళుతున్నట్లు వార్న‌ర్ పోజులిస్తాడు. ఇద్దరూ తమ పాత్రలను ఎక్సేంజ్‌ చేసుకుని అభిమానులకు వినోదాన్ని అందించారు.

క్యాండిస్ కూడా స్పోర్ట్స్‌మెన్‌:

క్యాండిస్ కూడా స్పోర్ట్స్‌మెన్‌:

డేవిడ్ వార్న‌ర్ భార్య క్యాండిస్ కూడా స్పోర్ట్స్‌మెన్‌. కానీ ఆమె స‌ర్ఫింగ్‌లో మేటి. ఫుల్‌ ఫిట్‌గా ఉండే క్యాండిస్‌.. బోట్ స‌ర్ఫింగ్‌లో ఎక్స్‌ప‌ర్ట్‌. ఈ సరదా టిక్‌టాక్‌ వీడియోను వార్నర్‌-క్యాండిస్‌లు వేర్వేరుగా తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. గత శనివారం క్యాండిస్‌తో కలిసి ఒక డ్యాన్స్‌ వీడియో చేసిన వార్నర్‌.. ఒక్కరోజు గ్యాప్‌ ఇచ్చి మరో వీడియో చేశాడు. ఇలా వరుసపెట్టి వీడియోలు చేసుకుంటూ పోతున్న వార్నర్‌.. మళ్లీ క్రికెట్‌ మొదలయ్యేవరకు ఇలానే చేస్తూ ఉంటాడేమో.

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు:

క్ష‌ణం తీరిక‌లేకుండా ప్ర‌జ‌ల ప్రాణాల కోసం త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడుతున్న వైద్య‌, పోలీస్ సిబ్బందికి సంఘీభావంగా డేవిడ్ వార్న‌ర్ మంగ‌ళ‌వారం గుండు చేసుకున్నాడు. ఇంట్లోని ట్రిమ్మర్ సాయంతో వార్నర్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. కరోనాను స‌మ‌ర్థంగా నిలువ‌రించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి ఇది నా మ‌ద్ద‌తు అని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.

సన్‌రైజర్స్ కెప్టెన్:

సన్‌రైజర్స్ కెప్టెన్:

కరోనా భయంతో ఐపీఎల్ 2020 జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. తాజా పరిస్థితుల నడుమ రద్దైయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ రద్దయితే.. ఆ స్థానంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు అతడు కెప్టెన్ కూడా. ఐపీఎల్ జరిగితే వార్నర్ ఆడుతాడని అతని మేనేజర్ జేమ్స్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, April 28, 2020, 8:34 [IST]
Other articles published on Apr 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+