For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

37 బంతుల్లో 69: వార్నర్ పవర్ హిట్టింగ్, సన్‌రైజర్స్ బోణి (వీడియో)

 David Warner wallops 69 for Sunrisers to defeat Steve Smith in IPL

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణి కొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (69: 37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ విజయంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ది కీలకపాత్ర. బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను డేవిడ్ వార్నర్ ఎదుర్కొని టార్గెట్‌ను ఛేజ్ తీరు నిజంగా అమోఘం. మ్యాచ్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగులు సునామీ సృష్టించాడు. దీంతో ఉప్పల్ స్టేడియంలో అసలు సిసలైన టీ20 మజా వచ్చింది.

రాజస్థాన్ నిర్దేశించిన 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ ప్రతీ బంతిని బౌండరీ తరలించాలనే కసితో ఆడాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ 37 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. వార్నర్ హిట్టింగ్ దెబ్బకు సాధించాల్సిన రన్‌రేట్ తగ్గిపోవడం... ఆ తర్వాత వార్నర్ ఔటైనా మిగతా బ్యాట్స్‌మన్ ఒత్తిడిలేకుండా ఆడారు.

 David Warner wallops 69 for Sunrisers to defeat Steve Smith in IPL

10 ఓవర్లలోపే బెయిర్‌స్టో(45)తో కలిసి వార్నర్ 110 పరుగులు రాబట్టాడు. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి సొంతగడ్డపై ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బోణీ కొట్టింది. వార్నర్(37 బంతుల్లో 69, 9ఫోర్లు, 2సిక్స్‌లు), బెయిర్‌స్టో(28 బంతుల్లో 45, 6ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.

వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ మీకోసం...

Story first published: Saturday, March 30, 2019, 15:54 [IST]
Other articles published on Mar 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+