Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవ్వులు పూశాయి: వార్నర్, విజయ్ శంకర్‌లతో ధోని సరదా ముచ్చట (వీడియో)

IPL 2019 : David Warner,Vijay Shankar Share Light Moment With MS Dhoni || Oneindia Telugu
David Warner, Vijay Shankar share light moment with MS Dhoni after SRH vs CSK match - Watch Video

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో చిట్‌చాట్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోని లేకుండా బరిలోకి దిగిన చెన్నై

ధోని లేకుండా బరిలోకి దిగిన చెన్నై

ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ధోనికి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో సురేశ్ రైనాకు కెప్టెన్సీ అప్పగించింది. చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ధోనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు.

వార్నర్, విజయ్ శంకర్‌లతో ధోని సరదా ముచ్చట

మ్యాచ్ అనంతరం ధోని సన్‌రైజర్స్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, విజయ్ శంకర్‌లతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంలో డేవిడ్ వార్నర్ ఏదో జోక్ వేయగా అక్కడ నవ్వులు పూశాయి. ఆ తర్వాత ధోని తనదైన శైలిలో స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి

ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు), జానీ బెయిర్ స్టో 44 బంతుల్లో 61 (3 ఫోర్లు, 3 సిక్సులు) అజేయంగా నిలవడంతో చెన్నైపై అలవోక విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత

డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత

అనంతరం చెన్నై నిర్దేశించిన 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పవర్‌ప్లేలో డేవిడ్ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు.

Story first published: Thursday, April 18, 2019, 16:41 [IST]
Other articles published on Apr 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+