Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా సెలవులు.. వార్నర్ ఏం చేస్తున్నాడంటే? (వీడియో)

David Warner uses tennis racket to hone catching skills amid self-isolation due to coronavirus pandemic
Watch : David Warner Uses Tennis Ball To Hone Catching Skills

సిడ్నీ: మహమ్మరి కరోనా దెబ్బకు ప్రపంచమే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తి‌గా స్థంభించింది. వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన కొన్ని క్రీడా ఈవెంట్లు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎటువంటి క్రికెట్ టోర్నీలు లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. అయితే క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

 టెర్రస్‌పై టెన్నిస్:

టెర్రస్‌పై టెన్నిస్:

టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌ లేకపోవడంతో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా తన ఇంట్లో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. తన క్యాచింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి వార్నర్ టెన్నిస్ ఆడుతున్నాడు. టెర్రస్‌పై ఉన్న వార్నర్.. ఒక చేతితో టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొడుతూ మరో చేతితో క్యాచ్ పట్టుకుంటున్నాడు. వార్నర్ కొట్టిన బంతి పిట్ట గోడకు తాకి అతని వద్దకే వస్తుంటుంది. ఓ సారి బంతి మిస్ ఆవబోగా.. అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు.

క్యాచ్‌లు ప్రాక్టీస్:

క్యాచ్‌లు ప్రాక్టీస్:

డేవిడ్ వార్నర్ తన కుమార్తెతో కలిసి టెన్నిస్ ఆడుతున్న వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'ఒక చేత్తో క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. గుర్తుంచుకో మృదువైన చేతులతో' అని వార్నర్ కాప్షన్ రాసుకొచ్చాడు. వార్నర్ టెర్రస్‌పై టెన్నిస్ ఆడుతుంటే ఆ పక్కనే కూర్చున్న అతని కూతురు తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

 హండ్రెడ్‌ లీగ్‌ నుంచి తప్పుకున్న వార్నర్:

హండ్రెడ్‌ లీగ్‌ నుంచి తప్పుకున్న వార్నర్:

డేవిడ్‌ వార్నర్‌ 'ది హండ్రెడ్‌' లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా లీగ్‌ నుంచి తప్పుకోలేదని.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రారంభ ఎడిషన్ 'ది హండ్రెడ్‌' లీగ్‌లో వార్నర్‌ సదరన్‌ బ్రేవ్‌ జట్టు తరఫున ఆడాల్సి ఉంది. నెల రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీకి 125,000 పౌండ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. మే 28న ఈ టోర్నీ ఆరంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా జూలై 17 నుండి ఆగస్టు 15 వరకు టోర్నీ జరగనుంది.

ఐపీఎల్ జరిగితే ఆడుతాడు:

కరోనా భయంతో ఐపీఎల్-13 జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. తాజా పరిస్థితుల నడుమ రద్దైయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వార్నర్ సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ జరిగితే డేవిడ్ వార్నర్ ఆడుతాడని అతని మేనేజర్ జేమ్స్ తాజాగా స్పష్టం చేశాడు. జరగకపోతే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయన్నాడు.

Story first published: Tuesday, March 24, 2020, 14:30 [IST]
Other articles published on Mar 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+