
ట్రావెల్ బ్యాన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ కేపిటల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఆస్ట్రేలియాకు తరలి వెళ్తారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నందు వల్ల భారత్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ట్రావెల్ బ్యాన్‌ను నిషేధించే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇదే కారణంతో- ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌కు దూరమయ్యారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా.. తమ దేశ ప్లేయర్లను వెనక్కి పిలిపించుకునే అవకాశాలను పరిశీలిస్తోంది.

టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చెబుతోంది?
మిగిలిన క్రికెటర్ల మాటెలా ఉన్నప్పటికీ.. డేవిడ్ వార్నర్ మాత్రం ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరం కావట్లేదని తెలుస్తోంది. అతను ఈ సీజన్ మొత్తానికీ అందుబాటులో ఉంటాడని సమాచారం. దీనిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఓ కీలక ప్రకటన చేసిందని అంటున్నారు. డేవిడ్ వార్నర్ కేప్టెన్సీలోనే తమ జట్టు అన్ని మ్యాచ్‌లనూ ఆడుతుందంటూ ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ స్పష్టం చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. అదే నిజమైతే- అభిమానులకు పండగే.

పరాజయాల పలకరింత..
ఈ సీజన్‌లో వార్నర్ తనకు స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. పరాజయాలు పలకరిస్తున్నాయతన్ని. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం అయిదు మ్యాచ్‌లను ఆడగా.. నాలుగింట్లో ఓడిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లే. ఇక మున్ముందు కోలుకోవడం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఫర్వాలేదనిపించినా.. కేప్టెన్‌గా విఫలమౌతున్నాడు వార్నర్.

ఆ మ్యాచ్‌తో బ్రూటల్‌గా ట్రోల్
ఇప్పటిదాకా అయిదు మ్యాచుల్లో అతను 136 పరుగుల చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ విమర్శలపాలయ్యాడు. భారీ షాట్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జానీ బెయిర్‌స్టో సెలెక్ట్ చేయకపోవడం పట్ల అభిమానులు అతనిపై భగ్గుమన్నారు. బ్రూటల్‌గా ట్రోల్ చేశారు. సూపర్ ఓవర్‌లో బెయిర్ స్టోను తీసుకుని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవంటూ వార్నర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలను గుప్పించారు. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
