బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న డేవిడ్ వార్నర్ (వీడియో)

హైదరాబాద్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) ఆరో సీజన్ అద్భుతంగా ఉండబోతోంది. ఇందుకు కారణం ఈ టీ20 లీగ్ టోర్నీలో అలెక్స్ హేల్స్, ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా గ్రేట్ డేవిడ్ వార్నర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఆడబోతున్నారు.
బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు బీపీఎల్‌లో సిల్హెట్ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

బీపీఎల్ ఆరో సీజన్‌లో డేవిడ్ వార్నర్
అలెక్స్ హేల్స్, ఏబీ డివిలియర్స్‌లు రంగపూర్ రైడర్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తుండగా... డేవిడ్ వార్నర్ సిల్హెట్ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వచ్చే సీజన్‌లో ఈ టోర్నీలో ఏడు జట్లు పోటీపడనున్నాయి.

జనవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు బీపీఎల్ ఆరో సీజన్
జనవరి 5 నుంచి ఫిబ్రవరి 8 మధ్య టోర్నీ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సిక్సర్స్‌తో ఒప్పందం చేసుకోవడం వార్నర్‌కు ఈ ఏడాది మూడో ఫ్రాంఛైజీ కావడం విశేషం. అంతేకాదు తొలిసారి ఈ టోర్నీలో డేవిడ్ వార్నర్ ఆడబోతున్నాడు.
ఫేస్‌బుక్‌లో వీడియోని పోస్టు చేసిన డేవిడ్ వార్నర్
క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధించిన ఏడాది పాటు నిషేధం త్వరలో ముగుస్తుండటంతో డేవిడ్ వార్నర్‌ని భాగస్వామ్యం చేసుకునేందుకు విదేశీ టీ20 లీగ్‌లు పోటీపడుతున్నాయి. సిక్సర్స్ జట్టు తరుఫున ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వార్నర్ ఫేస్‌బుక్‌లో వీడియోని పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications