
వైద్య సిబ్బందికి మద్దతుగా గుండు:
క్షణం తీరికలేకుండా ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య, పోలీస్ సిబ్బందికి సంఘీభావంగా డేవిడ్ వార్నర్ మంగళవారం గుండు చేసుకున్నాడు. ఇంట్లోని ట్రిమ్మర్ సాయంతో వార్నర్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. కరోనాను సమర్థంగా నిలువరించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి ఇది నా మద్దతు అని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.

స్మిత్, కోహ్లీలకు సవాల్:
తనలా చేయాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సహచర ఆసీస్ క్రికెటర్లు పాట్ కమ్మిన్స్, జో బర్న్స్, ఆడమ్ జాంపా, మార్కస్ స్టోయినిస్, స్టీవ్ స్మిత్‌కు సవాల్ విసిరాడు. 'కరోనాపై పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచేందుకు ఇలా తల వెంట్రుకలు షేవ్ చేసుకున్నాను. నాలాగా చేయాలంటూ విరాట్, స్మిత్‌కు చాలెంజ్ చేశాను' అని వార్నర్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

కుటుంబంతో జాలీగా:
ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 19 మంది చనిపోగా.. 4460 మందికి పాజిటివ్ అని తేలిందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రతిక పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిలో భాగంగా జూన్‌లో బంగ్లాదేశ్‌లో తాము పర్యటించే అవకాశం లేదని ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. ప్రస్తుతం కరోనా సెలవులను క్రికెటర్లు అందరూ ఇంటోనే ఉంటూ కుటుంబంతో జాలీగా గడుపుతున్నారు.
ఐపీఎల్ జరిగితే ఆడుతాడు:
కరోనా భయంతో ఐపీఎల్-13 జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. తాజా పరిస్థితుల నడుమ రద్దైయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ జరిగితే వార్నర్ ఆడుతాడని అతని మేనేజర్ జేమ్స్ ఇటీవలే స్పష్టం చేశాడు. జరగకపోతే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయన్నాడు. అయితే 'ది హండ్రెడ్' లీగ్ నుంచి మాత్రం అతడు తప్పుకున్నాడు.


Click it and Unblock the Notifications












