కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఓవర్‌సీస్ ప్లేయర్‌గా..

IPL 2020 : David Warner Breaks Virat Kohli Record In IPL | SRH Vs KKR | Oneindia telugu

అబుదాబి: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సొంతం చేసున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్) ఐపీఎల్‌లో 5000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఈ మైలురాయి అందుకున్న తొలి ఓవర్‌సీస్ ప్లేయర్‌గా ఈ ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ గుర్తింపు పొందాడు.

అంతేకాకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును కూడా అధిగమించాడు. కోహ్లీ 157 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు నమోదు చేయగా.. వార్నర్ 135వ ఇన్నింగ్స్‌లోనే 5వేల మార్క్‌ను అందుకొని కొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 5 వేల క్లబ్ చేరిన నాలుగో ఆటగాడు వార్నర్ కాగా.. అతని కన్నా ముందు విరాట్ కోహ్లీ(157), సురేశ్ రైనా(173), రోహిత్ శర్మ(187) ఈ ఫీట్ సాధించారు. ఇక వార్నర్ ఐపీఎల్ కెరీర్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో కడవరకు పోరాడిన వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయాన్నందుకుంది. ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్‌కు సూపర్ ఓవర్‌లో మూడు బంతులే ఆడిన హైదరాబాద్ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ బాల్‌కే వార్నర్ క్లీన్ బౌల్డ్ కాగా.. అబ్దుల్ సమద్ సెకండ్ బాల్‌కు క్విక్ డబుల్ తీసి మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రషీద్ వేసిన ఓవర్‌లో కేకేఆర్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బసిల్ థంపీ ఒక వికెట్ తీశాడు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. వార్నర్‌తో పాటు బెయిర్ స్టో(36), విలియమ్సన్(29) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా.. కమిన్స్, మావీ,వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.

ఎమ్మెస్కే ప్రసాద్ ఎక్కడా? తెలుగు కామెంట్రీ చెప్పడం లేదే? రాయుడు ఆటకు భయపడ్డాడా?

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 21:03 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X