
కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో పేరిట ఉన్న రికార్డుని డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టాడు. ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా జరిగిన మూడు టీ20ల్లో కోహ్లీ, మున్రోలు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించారు. 2015-16 సీజన్‌లో ఆసీస్ పర్యటన సందర్భంగా కోహ్లీ వరుసగా 90 నాటౌట్, 59 నాటౌట్, 50 పరుగులు చేశాడు.

2017-18 సీజన్‌లో కొలిన్ మన్రో
ఆ తర్వాత 2017-18 సీజన్‌లో కొలిన్ మన్రో విండీస్‌పై 53, 66, 104 పరుగులతో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో డేవిడ్ వార్నర్ నాటౌట్ నిలిచాడు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వార్నర్(100 నాటౌట్)గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సిరిస్‌లో 217 పరుగులు సాధించిన వార్నర్
అనంతరం బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టీ20లో(60 నాటౌట్), మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టీ20లో (57నాటౌట్) ఇలా మూడు టీ20ల్లోనూ నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఈ సిరిస్‌లో వార్నర్ మొత్తం 217 పరుగులు సాధించాడు. వార్నర్ అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

వంద సిక్సులు బాదిన రెండో ఆటగాడు
శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టీ20లో వార్నర్(57) హాఫ్ సెంచరీ సాధించడంతో టీ20ల్లో 900 పరుగులు చేసిన ఏకైక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు ఆస్ట్రేలియా తరుపున వంద సిక్సులు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకముందు మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 105 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications












