David Warner: 'కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు.. అసలు జీర్ణించుకోలేకపోతున్నా'

దుబాయ్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఐపీఎల్ 14వ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనను కనబరిచిన విషయం తెలిసిందే. కెప్టెన్, ప్లేయర్స్ మారుతూ వచ్చినా.. విజయాలు మాత్రం అందుకోలేదు. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇలా పట్టికలో అట్టడుగున ఉండే పరిస్థితి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎప్పుడూ రాలేదు.

ఇదివరకు ఫ్రాంఛైజీ, పేరు మారకముందు డెక్కన్ ఛార్జెస్‌గా ఉన్న సమయంలో తొలి సీజన్‌లో (2008) ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే. అయితే సన్‌రైజర్స్‌ అట్టడుగున నిలవడం లీగ్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎస్‌ఆర్‌హెచ్‌ 2016లో ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

వార్నర్‌ స్థానంలో కేన్

వార్నర్‌ స్థానంలో కేన్

భారత్‌లో జరిగిన తొలి అంచె ఐపీఎల్‌ 2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓడి పట్టికలో కేవలం రెండు పాయింట్లతో అట్టడుగున నిలిచింది. అయితే ఐపీఎల్ 2021 వాయిదా పడే సమయానికి ఒక మ్యాచుకు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్మెంట్ ఊహించని నిర్ణయం తీసుకుంది. డేవిడ్ వార్నర్‌ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించి అందరికి షాక్ ఇచ్చింది.

అయినా ఆ జట్టు రాత మారలేదు. అనంతరం ఆడిన ఓ మ్యాచులో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోయింది. ఆ మ్యాచులో డేవిడ్ భాయ్ ఆడలేదు. ఇక కేన్ సారథ్యంలోనూ యూఏఈలో కొద ఘోరంగా విఫలమై అట్టడుగు స్థానంతో టోర్నీని ముగించింది. పేలవ ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు చివరి మ్యాచ్‌ల్లో తుది జట్టులో కూడా స్థానం దక్కలేదు.

8 మ్యాచుల్లో 195 పరుగులు

8 మ్యాచుల్లో 195 పరుగులు

ఐపీఎల్ 2021లో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయిన విషయం తెలిసిందే. ఆడిన 8 మ్యాచుల్లో 107 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజనల్లో కంటే.. 2021లోనే అతి తక్కువ పరుగులు చేశాడు. 2014 నుంచి 2020 వరకు 500 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తూ వచ్చాడు. కానీ 2021లో మాత్రం ఫాంలో లేక తంటాలు పడ్డాడు. అయితే ప్రతీ ఆటగాడికి ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్మెంట్ మాత్రం అతడి పట్ల కఠినంగా వ్యవహరించింది.

ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ఆపై ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటివ్వలేదు. అంతేకాకుండా కనీసం డగౌట్లో కూడా అతడికి చోటివ్వలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన లీగ్ చివరి మ్యాచులని వార్నర్ ఓ సాధారణ ప్రేక్షకుడిలా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి కారణమేంటో ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం తనకు చెప్పలేదని వార్నర్‌ తాజాగా అన్నాడు.

కారణం చెప్పలేదు

కారణం చెప్పలేదు

తాజాగా డేవిడ్ వార్నర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యజమానులు, ట్రెవర్ బేలిస్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, టామ్ మూడీ, ముతయ్య మురళిధరన్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఓ నిర్ణయం తీసుకున్నారంటే.. ఏకగ్రీవంగానే తీసుకుని ఉంటారు.

ఎవరు నాకు మద్దతిచ్చారో, ఎవరు ఇవ్వలేదో చెప్పడం చాలా కష్టం. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణాన్ని చెప్పకపోవడం చాలా నిరాశ కలిగించింది. కెప్టెన్సీని తొలగించడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. నా ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. కానీ అన్నీ మరిచి ముందుకు వెళ్లాల్సిందే' అని పేర్కొన్నాడు.

KKR Playing XI vs DC:షకిబ్‌కే ఓటు..రసెల్ డౌట్!వెంకీ చెలరేగితే డబిడదిబిడే!ఢిల్లీతో బరిలోకిదిగే కేకేఆర్ జట్టిదే!

అభిమానులకోసమైనా

అభిమానులకోసమైనా

'హైదరాబాద్ నా రెండో ఇల్లు లాంటిది. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆరాధించారు. ఓ కుటుంబ సభ్యుడిలా చూశారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి ఎంతో అప్యాయంగా మాట్లాడారు. నా పిల్లల పట్ల అంతే అభిమానాన్ని చూపెట్టారు. ఇవన్నీ నా జీవితంలోనే మర్చిపోలేని మధుర క్షణాలు. హైదరాబాద్ అభిమానులకోసమైనా వచ్చే ఏడాది సన్‌రైజర్స్ జట్టుకు ఆడాలనిపిస్తోంది. కానీ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయంపైనే అది ఆధారపడి ఉంది.

నా ఐపీఎల్ భవితవ్యం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొత్తగా రెండు జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనుంది. ఏ జట్టుకు ఆడతానో ఇప్పుడే చెప్పలేను. సన్‌రైజర్స్ హైదరబాద్ తరఫున టైటిల్ గెలిచా. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు బ్యాట్‌తో రాణించా. నాకిచ్చిన ప్రతీ బాధ్యతను నెరవేర్చా. లోయరార్డర్‌లో ఆడాల్సి వచ్చినా బరిలోకి దిగా. హైదరాబాద్ తరఫున సుమారు 100 మ్యాచ్‌లు ఆడా. నా శక్తి సామర్థ్యాల మేరకు రాణించా. అందుకు చాలా గర్వంగా ఉంది' అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.

వార్నర్ కెప్టెన్సీలో టైటిల్

వార్నర్ కెప్టెన్సీలో టైటిల్

వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో కఠినమైన సీజన్లను ఆడింది. ఓడిపోయే మ్యాచులను కూడా డేవిడ్ భాయ్ ఒంటిచేత్తో గెలిపించాడు. అద్భుత ఓపెనింగ్ ఇచ్చి ఎన్నోసార్లు భారీ స్కోర్లు అందించారు. పెద్దపెద్ద స్టార్లు లేకపోయినా.. జట్టులో మంచి సమతూకం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించాడు.

2012లో డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్‌ సామి, శిఖర్‌ ధావన్‌, కామెరున్‌ వైట్‌ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో వార్నర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత సన్‌రైజర్స్‌ తలరాత మారిపోయింది. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ అందుకుంది. ఆపై కూడా సన్‌రైజర్స్‌ బాగానే ఆడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 13, 2021, 11:47 [IST]
Other articles published on Oct 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X