న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో సన్​సన్‌రైజర్స్‌దే బెస్ట్ డెత్ బౌలింగ్​: వార్నర్​

David Warner says Sunrisers Hyderabad has the best death bowling in IPL
Sunrisers Hyderabad Have Best Deathbowling In IPL - David Warner

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో తన జట్టు డెత్ బౌలింగ్ ఉత్తమమైనదని సన్‌రైజర్స్ హైదర్‌బాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్​తో కూడిన తమ జట్టు డెత్ బౌలింగ్​ ఐపీఎల్​లో అత్యుత్తమైనదని పేర్కొన్నాడు. 2016 ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ జట్టు పేసర్లు మరియు స్పిన్నర్ల కలయికతో అద్భుతంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడడంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు.

<strong>గేమ్ ఓడిపోయిన స్టీవ్‌ స్మిత్‌.. ట్రోల్ చేసిన సతీమణి!!</strong>గేమ్ ఓడిపోయిన స్టీవ్‌ స్మిత్‌.. ట్రోల్ చేసిన సతీమణి!!

మా జట్టు డెత్ బౌలింగే బెస్ట్

మా జట్టు డెత్ బౌలింగే బెస్ట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహచరుడు, ఇంగ్లడ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోతో శుక్రవారం డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను ఇద్దరు పంచుకున్నారు. 'మనకు మంచి జట్టు ఉంది. ఎక్కువ మంది బౌలర్లు ఉండడం మంచి విషయం. తొలి ఓవర్లలో మంచి స్వింగ్ బౌలింగ్ ఉంది. మన డెత్ బౌలింగ్​ ఐపీఎల్​లోనే అత్యుత్తమైనది' అని వార్నర్ అన్నాడు. 2014 నుండి వార్నర్ జట్టులో ఉండగా.. బెయిర్‌స్టో గత సీజన్‌లో సన్‌రైజర్స్‌లో చేరాడు. గతేడాది ఈజోడి అద్భుతమైన భాగస్వామ్యాలను అందించిన విషయం తెలిసిందే.

వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని ఇష్టపడతా

వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని ఇష్టపడతా

ఇద్దరు (వార్నర్, బెయిర్‌స్టో) వికెట్ల మధ్య పరుగెత్తటం వారి విజయవంతమైన భాగస్వామ్యానికి ప్రధాన కారణమని వార్నర్ తెలిపాడు. అలాగే వికెట్ల మధ్య పరుగెత్తడం అంటే తనకు ఇష్టమని డేవిడ్ చెప్పాడు. 'వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని నేను ఇష్టపడతాను. వికెట్ల మధ్య మన పరుగు అద్భుతంగా ఉంది. అదే మనకు ఓ బలమైన అంశంగా ఉంది. మన విజయవంతమైన భాగస్వామ్యానికి ప్రధాన కారణం ఇదే కదా బెయిర్‌స్టో' అని వార్నర్ పేర్కొన్నాడు.

12 మ్యాచ్‌లలో 692 పరుగులు

12 మ్యాచ్‌లలో 692 పరుగులు

'బెయిర్‌స్టో నీ సామర్థ్యం, ఆటపై ఉండే అవగాహన నాకు తెలుసు. నేను నీలో వీటినే ఇష్టపడుతున్నా. మనకు బలమైన అంశం ఇదే. మా మధ్య అవగాహన ఉంది. పరుగుల విషయంలో కూడా ఆలోచిస్తాం' అని వార్నర్ అన్నాడు. గత సీజన్‌లో వార్నర్ 12 మ్యాచ్‌లలో 692 పరుగులు చేయగా.. బెయిర్‌స్టో 10 మ్యాచ్‌ల్లో 445 పరుగులు చేశాడు. సన్​రైజర్స్​లో వార్నర్​, బెయిర్​స్టోతో పాటు కివీస్ కెప్టెన్ విలియమ్సన్ సైతం ఉన్న సంగతి తెలిసిందే.

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు

క్ష‌ణం తీరిక‌లేకుండా ప్ర‌జ‌ల ప్రాణాల కోసం త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడుతున్న వైద్య‌, పోలీస్ సిబ్బందికి సంఘీభావంగా డేవిడ్ వార్న‌ర్ ఇటీవలే గుండు చేసుకున్నాడు. ఇంట్లోని ట్రిమ్మర్ సాయంతో వార్నర్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. కరోనాను స‌మ‌ర్థంగా నిలువ‌రించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి ఇది నా మ‌ద్ద‌తు అని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.

Story first published: Friday, April 24, 2020, 16:12 [IST]
Other articles published on Apr 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X