
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో ఇంత కాలం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టులో కనిపించనున్నాడు. మెగా వేలంలోకి 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వచ్చిన వార్నర్‌ను 6 కోట్ల 25 లక్షల రూపాయలకు ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తన ప్రస్థానం ఢిల్లీ జట్టు తరఫునే మొదలుపెట్టాడు. 2009 నుంచి 2013 వరకు ఢిల్లీకే వార్నర్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2014 నుంచి 2021 వరకు సుదీర్ఘం కాలంపాటు సన్‌రైజర్స్ తరఫున ఆడాడు. ఎట్టకేలకు తన పాత జట్టుకే చేరిన నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో డేవిడ్ వార్నర్ ఓ పోస్ట్ పెట్టాడు.
రాబోయే సీజన్‌లో కొత్త మేనేజ్‌మెంట్‌ను, కొత్త టీమ్‌మెట్స్‌ను, కొత్త స్టాఫ్‌ను కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఢిల్లీ అభిమానులకు మళ్లీ దగ్గర అయినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా తన కొత్త జట్టైనా ఢిల్లీ అభిమానులను వార్నర్ ఓ కోరిక కూడా కోరేశాడు. అదేంటేంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి పలు సూచనలు ఇవ్వాలని తన కొత్త జట్టు అభిమానులను అడిగాడు. కాగా గత సీజన్లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌కు పలు కారణాలతో ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్ భారీ ధర పలుకుతాడని అంతా ఊహించినప్పటికీ అలా జరగలేదు. సాధారణ ధరకే అమ్ముడుపోయాడు.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఐపీఎల్ 40కి పైగా సగటు ఉన్న అరుదైన బ్యాటర్ అని చెప్పుకోవాలి. కెరీర్‌లో ఇప్పటివరకు ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 41 సగటుతో 5449 పరుగులు చేశాడు. ఇందులో 50 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.