David warner: సన్‌రైజర్స్ అయితే ఏంటీ..? వార్నర్ తన పాత టీంను లెక్కలోకి కూడా తీసుకోవట్లే

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయంలో ఓ ఆసక్తికర విషయమేంటంటే.. డేవిడ్ వార్నర్ తన పాత టీం సన్ రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో ఆడనుండడమే. ప్రస్తుత సీజన్లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు.. వార్నర్ 2015నుంచి 2021సీజన్ వరకు సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక రన్ స్కోరర్‌లలో కూడా ఒకడిగా ఉన్నాడు. ఇక 2016లో సన్‌రైజర్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఇక ఎస్ఆర్‌హెచ్ అంటే వార్నర్.. వార్నర్ అంటే ఎస్ఆర్‌హెచ్ అనేంతగా వార్నర్ మారిపోయాడు.

విభేదాల వల్ల వార్నర్ సన్‌రైజర్స్‌కు దూరం
కానీ 2021సీజన్లో టీమ్ మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు విభేదాలొచ్చాయి. ఇక టీం మేనేజ్‌మెంట్ వార్నర్‌ను తొలుత కెప్టెన్‌గా తొలగించింది. అలాగే మ్యాచ్‌లకు కూడా తుది జట్టులోకి తీసుకోలేదు. ఇక ఆ సీజన్ తర్వాత వార్నర్‌ను పూర్తిగా వదులుకుంది. ఇక ఆ తర్వాత మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వార్నర్‌ను వేలంలో రూ.6కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో తన కెరీర్ ప్రారంభంలో వార్నర్ ఢిల్లీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. దీంతో తన తొలి టీంలో వార్నర్ మళ్లీ చేరినట్లయింది.

ఇతర జట్లలాగే సన్ రైజర్స్ జట్టుతో ఆడతా
ఈ మ్యాచ్ గురించి వార్నర్ అభిప్రాయాన్ని స్పోర్ట్స్ కామెంటర్ కోరగా.. 'నా అభిప్రాయం ప్రకారం.. ఇతర జట్లతో జరిగిన మ్యాచ్‌లు ఎలా ఆడుతున్నానో అలాగే సన్ రైజర్స్‌తో జరగబోయే మ్యాచ్‌ను అదే స్పోర్టివ్‌నెస్‌తో తీసుకుంటా. ప్రాక్టీసు సెషన్లలో పాల్గొనాలి. మ్యాచ్‌కు సిద్ధం కావాలి' అని మ్యాచ్‌పై తన వ్యూ గురించి వార్నర్ తెలిపాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ 3హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను పృథ్వీషాతో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలను నమోదు చేస్తున్నాడు. 'మేము మంచి ఆరంభాలు నమోదు చేస్తున్నా.. గత మ్యాచ్‌లో మేమిద్దరం చీప్‌గా ఔటయ్యాం. ఇక మంచి ఓపెనింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం' అని
వార్నర్ పేర్కన్నాడు.

టాపార్డర్ నిలదొక్కుకుంటే..
వార్నర్ జట్టులోని టాప్ త్రీబ్యాటర్ల పాత్రపై మాట్లాడుతూ.. 'నేను గానీ పృథ్వీ షా గానీ, మిచెల్ మార్ష్ గానీ 80 లేదా 90పరుగులు చేయడం చాలా ముఖ్యం. లేకపోతే టాపార్డర్లో మేం 100పరుగుల పైచిలుకు భాగస్వామ్యాలు నమోదు చేస్తే మాకు ఎడ్జ్ ఉంటుంది. తద్వారా తొలుత బ్యాటింగ్ చేస్తే మంచి స్కోరు నమోదు చేయొచ్చు లేదా.. హైస్కోరింగ్ మ్యాచ్ అయితే ఛేజ్ చేయడానికి కొంత ఈజ్ లభిస్తుంది. మిగతా జట్ల ఫోకస్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ సీజన్లో బాగా రాణిస్తున్న జట్లు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉండడానికి కారణం.. వాళ్ల టాపార్డర్ భారీగా పరుగులు చేయడమే. ఇక గెలవడానికి మమ్మల్ని మరింత సానపెట్టుకోవాల్సిన అవసరముంది' అని వార్నర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications